IPL Auction 2025 Live

Corona in TS: తెలంగాణలో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్, ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 1,054 మందికి పాజిటివ్

అత్యధికంగా హైదరాబాదులో 396 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులు గుర్తించారు.

Coronavirus in India (Photo Credits: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 44,202 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,054 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 396 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులు గుర్తించారు. ఇంకా 630 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

అదే సమయంలో 795 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,21,671 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,11,568 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,992 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 8న 1061 కరోనా కేసులు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో నమోదు కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

దేశంలో మంకీపాక్స్ డేంజర్ బెల్స్, కేరళలో మరో కేసు వెలుగులోకి, ఇండియాలో 7కు చేరుకున్న మంకీపాక్స్ బాధితుల సంఖ్య

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలో కరోనా లక్షణాలతో మంగళవారం ఓ వీఆర్‌ఏ(68) మృతి చెందారు. ఆయన నాలుగు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలగా.. చికిత్స పొందుతూనే కన్నుమూశారు. కాగా మండలంలో మరో వీఆర్‌ఏకు కూడా కరోనా పాజిటివ్‌గాతేలినట్లు వైద్యులు పేర్కొన్నారు.