Telangana Shocker: ఆ యువతి కిడ్నాప్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి, 100 యువకులతో కలిసి యువతిని ఎత్తుకెళ్లిన లవర్, గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతున్న యువతి తల్లిదండ్రులు

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్న గూడలో యువతి కిడ్నాప్‌ (man kidnapped young woman) తీవ్ర కలకలం రేపుతోంది.సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు (100 member in Adibatla Rangareddy) ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా ఎత్తుక్కెళ్లారు.

man kidnapped young woman (Photo-Video Grab)

Hyd, Dec 9: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్న గూడలో యువతి కిడ్నాప్‌ (man kidnapped young woman) తీవ్ర కలకలం రేపుతోంది.సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు (100 member in Adibatla Rangareddy) ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా ఎత్తుక్కెళ్లారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. దుండగులను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులు, పక్కింటి వ్యక్తులకు గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు తెలిపారు. యువతని కిడ్నాప్ చేసింది టీ టైం ఓనర్‌ నవీన్‌ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. 100 మంది యువకులు తన కూతురు వైశాలిని కిడ్నాప్‌ చేసినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీచర్ పాడుబుద్ధి, విద్యార్థిని మొబైల్‌కు ఆ వీడియోలు, హనీమూన్‌‌లో అలా చేసుకుందామంటూ ఛాటింగ్, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

అయితే యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది. నవీన్ రెడ్డి, వైశాలి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి చేసుకోమని నవీన్‌ పదే పదే యువతి వెంటపడుతున్నాడు. శుక్రవారం రోజు వివాహ సంబంధం కోసం మరో పెళ్లివారు వైశాలి ఇంటికి వస్తున్నారని ముందే పసిగట్టి నవీన్ రెడ్డీ అమ్మయి ఇంటి దగ్గరికి వందకుపైగా గుండాలతో వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేశాడు. దీనిపై కేసు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిగత సమస్యలు, కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి కన్న కొడుకును చంపించిన కసాయి తండ్రి, శవాన్ని చెరుకుతోటలో పూడ్చి..మిస్సయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ లో తాజాగా జరిగిన యువతి కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు బయటికి వస్తున్నాయి. ఈ కిడ్నాప్ ఉదంతంలో మెయిన్ గా మిస్టర్ టి నిర్వాహకుడు ” నవీన్ రెడ్డి ” అని తెలుస్తుంది. కిడ్నాప్ కి గురైన యువతి ముచర్ల వైశాలి . కాగా 24 ఏళ్ల వయసున్న ఈమె ప్రస్తుతం డెంటల్ డాక్టర్ గా చేస్తుంది. ఆమె తల్లిదండ్రులు ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల. గతంలోనే నవీన్ రెడ్డి పై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. తమ కూతుర్ని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుతున్నారు.

ఈ సంధర్భంగా వైశాలి తల్లి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆ వీడియో లో ఆమె మాట్లాడుతూ… సుమారు 50, 60 మందితో వచ్చిన నవీన్ రెడ్డి బలవంతంగా అమ్మాయిని ఎత్తుకు పోయాదని వాపోయారు. ఈరోజు తమ కూతురుకి పెళ్లి చూపులు చూస్తున్నాం అని అందుకే వారి బంధువులు కూడా ఇంటికి వచ్చారని ఇలాంటి తరుణంలో కావాలనే నవీన్ ఇలా చేశాడని కన్నీరు పెట్టుకున్నారు. పెళ్లి చూపులను ఆపాలి కానీ అమ్మాయిని ఎత్తుకుపోవడం ఏంటని బాధపడుతున్నారు. మా కూతుర్ని ఎలా అయిన క్షేమంగా ఇంటికి తీసుకు రావాలని కోరుతున్నారు.

మరోవైపు ఇందుకు ప్రతిచర్యగా అమ్మాయి తరుపు బంధువులు నవీన్ రెడ్డి టీ షాప్ ని తగలబెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ షాప్ లో సామాగ్రిని అంతటినీ పగలగొట్టి షాప్ ని తగాలబెట్టిన దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif