TRS MLAs Poaching Row: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగొలు కుట్ర ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి ఆడియో లీక్

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగొలు కుట్ర ఎపిసోడ్‌ (TRS MLAs Poaching Row) హాట్‌టాపిక్‌గా మారింది.రెండు రోజుల నుంచి ఈ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఎపిసోడ్ రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.

buying TRS MLAs (Photo-ANI)

Hyd, Oct 28: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగొలు కుట్ర ఎపిసోడ్‌ (TRS MLAs Poaching Row) హాట్‌టాపిక్‌గా మారింది.రెండు రోజుల నుంచి ఈ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఎపిసోడ్ రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.

ఇదిలా ఉంటే మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటనలో తాజాగా ఓ ఆడియో బయటకొచ్చింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఫామ్‌హౌజ్‌ మీటింగ్‌కు ముందు రామచంద్రభారతితో రోహిత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.

ఎమ్మెల్యేల కొనుగోలుతో మా పార్టీకి, నాకు గానీ ఎలాంటి సంబంధం లేదు, యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో ప్రమాణం చేసిన బండి సంజయ్

ఫోన్‌ సంభాషణ ఇదే

రామచంద్రభారతి: హాలో.. హలో..

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: నమస్తే స్వామీజీ ఎలా ఉన్నారు.

స్వామీజీ: బాగున్నాను. మీరెలా ఉన్నారు.

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: నేను బాగున్నాను.

స్వామీజీ: నందు మేము మాట్లాడుకున్నాము. మాకు కొన్ని వివరాలు చెప్తే సార్‌తో మాట్లాడతాను.

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: హా స్వామిజీ

స్వామీజీ: పేరు పంపితే బాగుంటుంది.

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి:పేర్లు చెప్పడం ఇప్పుడు కష్టం. ఇప్పటికి ఇద్దరు కన్ఫర్మేషన్‌ ఇచ్చారు. కలిసి మాట్లాడితే బాగుంటుంది స్వామిజీ.

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: ప్రస్తుతం మేం ముగ్గురం రెడీగా ఉన్నాం.

స్వామీజీ: మీరు నెంబర్‌-2 ముందు ఎమ్మెల్యేల పేర్లు చెబుతారా

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: నెంబర్‌ 2 ముందు పేర్లు చెబుతాను. ఈ విషయం బయటపడితే మా పని అయిపోతుంది.మా సీఎం గురించి మీకు తెలుసు కదా.. ఆయన చాలా దూకుడుగా ఉంటారు.

రామచంద్రభారతి: ఆ ముగ్గురి పేర్లు నేను తెలుసుకుంటే ముందుకెళ్లడానికి మరింత సులభం. అధిష్ఠానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఉంది. మనం ఈ నెల 26న కూర్చొని మాట్లాడుకుందాం. నెం.2 ఎదుట ఎవరెవరు ఓకే అన్నారో పేర్లు చెబుతారా..?

రోహిత్‌రెడ్డి: నెం.2 ఎదుట పేర్లు చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్లీజ్‌ ప్లీజ్‌ ఈ విషయం బయటకు పొక్కొద్దు.

రామచంద్రభారతి: మీకు ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ భద్రత, మీ భవిష్యత్‌ అంతా కేంద్రం చూసుకుంటుంది. మా సంస్థలో బీఎల్‌ సంతోష్ చాలా కీలకం. నెం.1, 2లే బీఎల్‌ సంతోష్‌ ఇంటికి వస్తుంటారు. నెం.1, నెం.2ల ఇంటికి బీఎల్‌ సంతోష్‌ వెళ్లరు. అది RSS ప్రొటోకాల్. ఇలాంటి విషయాలను హ్యాండిల్‌ చేయడంలో బెంగాల్‌ ఎపిసోడ్‌ మాకు మంచి అనుభవం.

నందూ: స్వామీజీ మరొక్క విషయం, రోహిత్‌ సార్‌కు శరత్‌ చాలా దగ్గరి వ్యక్తి.

రామచంద్రభారతి: అరబిందో ఫార్మా శరతేనా.. అది చాలా సంక్లిష్టమైన కేసు, మనం వారితో కూర్చొని డీల్‌ చేయాలి.

నందూ: స్వామీజీ మీరు వచ్చినప్పుడు వాళ్లతో మీటింగ్‌ ఏర్పాటు చేస్తాం.

రోహిత్‌రెడ్డి: నందన్న వద్దు.. నందన్నా ఈ ఫాల్స్‌ ప్రామిసెస్ వద్దు, స్వామీజీ ఇందులో నేను ఇన్వాల్వ్‌ కాను.

అతను నాకు మంచి మిత్రుడే కానీ, ప్రస్తుతానికి ఆ విషయంలో ఇన్వాల్వ్‌ కాలేను స్వామీజీ.

రామచంద్రభారతి: సరే, పర్వాలేదు. మనం ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిద్దాం.

రోహిత్‌రెడ్డి: ‌థాంక్యూ స్వామీజీ.

రామచంద్రభారతి: థ్యాంక్యూ..

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement