Telangana MLC Elections Polling: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్, మూడు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్, టీచర్‌ స్థానాలు కలిపి మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది(Telangana MLC Elections Polling).

Telangana MLC Elections Polling begins(X)

Hyd, Feb 27:  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్, టీచర్‌ స్థానాలు కలిపి మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది(Telangana MLC Elections Polling).

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర ప్రైవేటు మేనేజ్‌మెంట్(MLC Elections Polling begins), అథారిటీల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేలా యజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వాలని అధికారులు కోరారు.

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై అన్ని స్కూళ్లలో తెలుగు బోధన తప్పనిసరి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఉమ్మడి మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం(Teacher MLC), ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు కంట్రోల్‌ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు సహా కేంద్ర ఎన్నికల సంఘం(CEC) అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చని రిటర్నింగ్‌ అధికారులు సూచించారు.

మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తమ్‌రెడ్డి, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు. వీరి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. పోలింగ్ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోగా మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement