Telangana Rains: మళ్లీ ముంచెత్తిన వర్షం, 5 రోజులు స్కూళ్లకు సెలవు, చెరువుల మత్తడితో పలు గ్రామాలకు రాకపోకలు బంద్..వివిధ జిల్లాల్లో వర్షాలకు సంబంధించిన వీడియోలు..

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ...పింక్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

Hyd, Sep 4: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ...పింక్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

ఇక తెల్లవారుజాము నుంచి మహబూబాబాద్ జిల్లాలో భారీగా కురుస్తుండటంతో బయ్యారం పెద్ద చెరువు ఉదృతంగా ప్రవహిస్తోంది. గార్ల మండలంలో పొంగి పొర్లుతోంది పాకాల వాగు. పాకాల వాగు హైలెవల్ బ్రిడ్జి పైనుంచి మత్తడి ప్రవహిస్తుండగా రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.దీంతో మహబూబాబాద్ డిపోకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. మేడారంలో భారీ వర్షం, వేల ఎకరాల్లో నేలకొరిగిన చెట్లు, డ్రోన్ వీడియో వైరల్ 

Here's Video:

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. తిరిగి విద్యాసంస్థలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అన్నియాజమాన్య విద్యాసంస్థలు సెలవును ఖఛ్చిత్తంగా పాటించాలని..ఈ సదరు సమాచారాన్ని వెంటనే విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు.

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుత నీటిమట్టం 42.2 అడుగులకు చేరగా దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ...ఇబ్బందులు ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలన్నారు కలెక్టర్.

Here's Videos:

From Last One 1Hr...Heavy RainFall At

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement