COVID in TS: తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 1417 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,58,513కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య

రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటున్నప్పటికీ గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 264 పాజిటివ్ కేసులు రికార్డ్ చేయబడ్డాయి....

Coronavirus Cases in India (Photo Credits: PTI)

Hyderabad, September 14:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 34,427 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1417 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 2,430 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,69,339 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,58,513కి చేరుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటున్నప్పటికీ గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.  నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 264 పాజిటివ్ కేసులు రికార్డ్ చేయబడ్డాయి. ఇటు మేడ్చల్ నుంచి కూడా ఇటీవల కాలంలోనే అత్యల్పంగా కేవలం 25 కేసులు నమోదవడం కొంత ఊరటనిచ్చే విషయం.

అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం కరోనా విజృంభన ఎప్పట్లాగే కొనసాగుతోంది, నిన్న కూడా పలు జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి నుంచి 133, సంగారెడ్డి నుంచి 107 , కరీంనగర్ నుంచి 108 కేసుల చొప్పున రికార్డ్ అయ్యాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 13 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 974 కు పెరిగింది.

అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 2,479 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,27,007 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement