COVID19 in TS: తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కొవిడ్ కేసులు, కొత్తగా మరో 1637 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 18 వేలకు పెరిగిన ఆక్టివ్ కేసులు

ఇప్పుడు చాలా మంది కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు. ఏమౌతుందిలే అన్న నిర్లక్ష్యపు ధోరణిని కనబరుస్తున్నారు. పండగల సీజన్ కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ మళ్ళీ విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల పెరుగుదలతో గతవారం 17 వేలలో ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, నేడు 18 వేలపైకి ఎగబాకింది....

COVID in Telangana| Representational Image (Photo Credits: IANS)

Hyderabad, November 4:  తెలంగాణలో కొవిడ్19 తీవ్రత గత రెండు, మూడు రోజులుగా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు చాలా మంది కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు. ఏమౌతుందిలే అన్న నిర్లక్ష్యపు ధోరణిని కనబరుస్తున్నారు. పండగల సీజన్ కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ మళ్ళీ విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల పెరుగుదలతో గతవారం 17 వేలలో ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, నేడు 18 వేలపైకి ఎగబాకింది. 

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 45,526 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,637 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 740 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 44,39,856 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,44,143కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 292 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 129, రంగారెడ్డి నుంచి 136, కొత్తగూడెం నుంచి 118, పక్కనే  ఖమ్మం నుంచి 74, అలాగే నల్గొండ నుంచి 101 మరియు కరీంనగర్ నుంచి 90 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 6 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,357కు పెరిగింది.

అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 1473 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 224,686 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,100 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement