COVID in TS: తెలంగాణలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా, కొత్తగా మరో 495 పాజిటివ్ కేసులు మరియు 4 కోవిడ్ మరణాలు నమోదు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనైతే ఒక వారంలోనే రోజూవారీ కేవిడ్ కేసుల సంఖ్య మూడు రేట్లు పెరిగింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.....

Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, March 25: తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనైతే ఒక వారంలోనే రోజూవారీ కేవిడ్ కేసుల సంఖ్య మూడు రేట్లు పెరిగింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో  అన్ని విద్యాసంస్థలు మరియు యూనివర్శిటీల పరీక్షలు వాయిదాపడ్డాయి. బహిరంగ ప్రదేశాలలో మరియు జన సముదాయం ఎక్కువ ఉండే చోట ఆంక్షలు విధించబడుతున్నాయి, ప్రజలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 56,964 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 493 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 893 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,04,791కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 138 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 35 కేసులు, మేడ్చల్ నుంచి 42 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,680కు పెరిగింది.

అలాగే బుధవారం సాయంత్రం వరకు మరో 157 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,99,427 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,684 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లలతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement