Kanti Velugu Program: కంటి పరీక్షలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి, నేటి నుంచి తెలంగాణలో వంద రోజుల పాటు పరీక్షలు కంటి పరీక్షలు, 16,556 శిబిరాలు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు (Kanti Velugu Program) రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహిస్తున్నాయి.

Kanti Velugu Program (Photo-Twitter)

Hyd, Jan 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు (Kanti Velugu Program) రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు.

అలాగే నేటి నుంచి వంద రోజుల పాటు పరీక్షలు (Second phase of Kanti Velugu program) నిర్వహించనున్నారు. దీనికోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16,556 చోట్ల అధికారులు శిబిరాలను ఏర్పాటు చేశారు. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా అన్నిరోజుల్లో కంటి పరీక్షలు చేస్తారు. ఇంటింటికి వెళ్లి కంటివెలుగు స్లిప్పులను ఏఎన్‌ఎంలు పంపిణీ చేయనున్నారు. వ్యక్తి వివరాలు, టెస్టుకు వెళ్లాల్సిన ప్రాంతం, సమయాలను అందులో పొందుపరుస్తారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 120 మందికి పరీక్షలు చేయనున్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేయనున్నారు.

స్కూల్లో కుర్చీలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా గుండెపోటు, తోటి ఉపాధ్యాయుల ముందే కుప్పకూలిన ఉపాధ్యాయురాలు, మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాద ఘటన

ఇక ఎవరికైనా కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తే… ఆ వివరాల్ని ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఆ వివరాల్ని తీసుకొని కంప్యూటర్‌లో నమోదు చేయించే ఉన్నతాధికారులు.. ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడు, ఎక్కడ ఆపరేషన్ ఉండేదీ లబ్దిదారులకు ఒకట్రెండు రోజుల్లో చెబుతారు. ఆ ప్రకారం లబ్దిదారులు ఆయా ఆస్పత్రికి వెళ్లి.. ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.

కంటి పరీక్షలకు వచ్చేవారు ఆధార్‌ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలి. అక్కడ సిబ్బంది వారి పేరు, ఫోన్‌ నంబర్‌, ఆధార్‌, చిరునామాలాంటి సమగ్ర వివరాలను సేకరిస్తారు. శిబిరంలో మొత్తం ఆరు దశల్లో పరీక్ష జరుగుతుంది. ప్రక్రియ మొత్తం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిర్వహిస్తారు. బాధితుల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రజల కంటి ఆరోగ్యంపై పర్యవేక్షణకు అవకాశం కలుగుతుంది.

బీజేపీని తరిమికొట్టడమే మా లక్ష్యం, ఖమ్మం బహిరంగ సభలో గర్జించిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ సభలో ఎవరెవరు ఏమన్నారంటే..

శిబిరంలో దృష్టిలోపాలు గుర్తించినవారికి అక్కడికక్కడే రీడింగ్‌ గ్లాసులు అందజేస్తారు. ప్రిస్క్రిప్షన్‌ గ్లాసెస్‌ అవసరం ఉన్నవారికి కాస్త ఆలస్యంగా అందుతాయి. వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ను ఆన్‌లైన్‌లో అద్దాల తయారీ కంపెనీకి పంపుతారు. లబ్ధిదారుడి పేరు, చిరునామా, ఏ ప్రాంతంలో శిబిరం నిర్వహించారు? ఏ సబ్‌ సెంటర్‌/ ఏ ఏఎన్‌ఎం పరిధిలోకి వస్తుంది? లాంటి వివరాల ఆధారంగా ప్రిస్కిప్షన్‌ గ్లాసెస్‌ నేరుగా సంబంధిత ఏఎన్‌ఎంకు చేరుతాయి. అనంతరం వారు లబ్ధిదారుడికి అందజేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,763 గ్రామాలు, పట్టణాల్లోని 3,788 ప్రాంతాల్లో (వార్డులు) కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. మొత్తంగా 16,533 ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. శిబిరం ప్రారంభం అయ్యేముందు ఆ ప్రాంతంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఇంటికీ ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు. మరోవైపు కంటి పరీక్షల కోసం ప్రభుత్వం ఇప్పటికే 1500 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement