Representational Image (Photo Credits: ANI)

Manthani, Jan 18: కరీంనగర్ జిల్లాలోని మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన్నీరు సునీత(37) పాఠశాలలో బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఫిజికల్‌ సైన్స్‌ బోధించే సునీత పాఠశాలలోని కార్యాలయగదిలో తోటి ఉపాధ్యాయులతో కలిసి కుర్చీలో కూర్చుంది. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. తోటిసిబ్బంది పరీక్షించి వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. వైద్యులు అక్కడికి చేరుకుని పరీక్షించగా.. అప్పటికే పనిపోయిందని తెలిపారు.

30-35 వయస్సు వారికే గుండెపోటు అవకాశాలు ఎక్కువ, ఎందుకో తెలుసా? సంచలనం సృష్టిస్తున్న డాక్టర్ల అధ్యయనాలు, గతంతో పోలిస్తే పెరిగిన గుండెపోటు రిస్క్ శాతం

అప్పటివరకు తమతో ఉన్న ఉపాధ్యాయురాలు ఒక్కక్షణంలో చనిపోవడాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయురాలు జీర్ణించుకోలేకపోతున్నారు. సునీతది మంచిర్యాల జిల్లాకేంద్రంలోని గౌతమేశ్వరకాలనీ. ఈమె భర్త కూడా అంతర్గాం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.