New Delhi, June 02: భారత యువతకు గుండెపోటు (heart attack ) టెన్షన్ పట్టుకుంది. భారత్ తో (India) పాటు దక్షిణాసియా దేశాలకు గుండెపోటు టెన్షన్ రెట్టింపు అవుతోంది. దక్షిణాసియా దేశాల్లోని 7 శాతం జనాభాకు గుండెపోటు (Heart attack) భయం వెంటాడుతోంది. తెలంగాణలో పురుషుల్లో గుండె జబ్బుల రిస్క్ 20.3శాతంగా ఉంది. మహిళల్లో 8.3 శాతం అంటూ నివేదికలు చెబుతున్నాయి. సగటున గుండె జబ్బుల ముప్పు మగాళ్లలో 21.4 శాతం, మహిళల్లో 12.7 శాతంగా ఉందని తేలింది. హార్ట్ ఎటాక్ అంటే.. అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేదా గుండెపోటుగా పిలుస్తారు. గుండె కండరాలకు రక్త ప్రసరణ ఒక్కసారిగా ఆగిపోతుంది. గుండె కండరాలకు హాని కలిగించే తీవ్రమైన పరిస్థితిగా చెబుతారు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI) అనేది ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే వచ్చేది.

Risk Of Heart Disease: రోజుకు కనీసం ఆరు  గంటలైన నిద్రపోతున్నారా, లేదంటే మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే 

40ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారిలో గుండెపోటు చాలా అసాధారణమైనదిగా గుర్తించాలి. కానీ ఇప్పుడు ప్రతి ఐదుగురిలో ఒకరు 40ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలోనే గుండెపోటు వస్తోంది. ఇప్పుడు ఈ సమస్య ఆందోళనకరంగా మారింది. ప్రస్తుత జీవనశైలిలో 20ఏళ్లు లేదా 30ఏళ్ల ప్రారంభంలోనే గుండెపోటు రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. 2000, 2016 మధ్య ఈ చిన్న వయస్సులో గుండెపోటుల రేటు ప్రతి ఏడాది 2శాతం పెరుగుతూ వస్తోంది. కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD), ఇతర సమస్యలతో పాటు, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI)కి దారితీయవచ్చు. దీని కారణంగానే ఆకస్మిక మరణానికి దారి తీస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. చిన్న వయస్సులో ఈ సమస్య ఉన్న వ్యక్తి కుటుంబంపై భారం ఏర్పడవచ్చు.

35 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారిలో MI సాధారణ కారణాలివే :

– జీవనశైలి

– అతిగా మద్యపానం, ధూమపానం

– అధిక బరువు

– ఒత్తిడి

– రక్తపోటు,

-మధుమేహం

ధూమపానం(Smoking), ఊబకాయం(Obecity), శారీరక శ్రమ లేకపోవడం, హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ఇతర కారణాల వల్ల యువకులలో కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రాబల్యం పెరిగింది. మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులు పనిచేయకపోతే.. రక్త ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. దాంతో రక్తప్రసరణ నిలిచిపోతుంది. ఫలితంగా గుండెపోటు వస్తుంది.

Puneeth Rajkumar Heart Attack: పునీత్ కుమార్ హార్ట్ ఎటాక్‌తో అంతా షాక్, యువకుల్లో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం, ఇలా చేస్తే మీ గుండె పదిలం... 

MI నిర్ధారణ :

మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI) నిర్ధారించడానికి, రక్తపోటు, పల్స్ రేటు, ECG, ఎకో కార్డియోగ్రఫీ ట్రోపోనిన్ పరీక్ష వంటి క్లినికల్ పరీక్షలు చేయించుకోవాలి. మీ లక్షణాలను బట్టి మెడికల్ హిస్టరీని పరిశీలిస్తారు.

మీ గుండెకు హాని కలిగించే ప్రమాద కారకాలను తెలుసుకోవడానికి పూర్తిగా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. తీవ్రమైన MI చికిత్స ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా తీవ్రమైన MI లేదా గుండెపోటు వంటి పరిస్థితులకు వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలి.

మందులు :

రక్తం పలుచగా ఉండేందుకు

యాంటీ ప్లేట్‌లెట్ మందులు

నొప్పి & ఒత్తిడి నివారణ మందులు

గడ్డలను కరిగించే మందులు

రక్తపోటుకు

MI పరిస్థితిని నివారించడం

ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత జీవితంలో ఎప్పుడైనా మళ్లీ రావొచ్చు. అందుకే ముందుగానే ఈ చికిత్సను ప్రారంభించడం ఎక్కువ కాలం జీవించవచ్చు. చిన్న వయస్సులోనే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.

– ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి.

– సోడియం & ఉప్పు వినియోగాన్ని తగ్గించండి.

– ప్యాక్ చేసిన ఆహారాన్ని నివారించండి.

– మీ రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను చెక్ చేసుకోండి.

– ధూమపానం మానేయండి, పొగను పీల్చడం మానుకోండి

– ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి.

– MI అనేది తీవ్రమైన పరిస్థితి.. యువకులలోనే ఈ రిస్క్ ఎక్కువ.

– కొంచెం వ్యాయామం, స్వీయ సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ ప్రాణాంతక వ్యాధి ప్రమాదాన్ని నివారించవచ్చు.