Telangana Shocker: హాస్టల్లో విగతజీవిగా కనిపించిన ఇంటర్‌ విద్యార్థిని, ప్రిన్సిపల్ మా కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపణ

సూర్యాపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది.

Representative Photo (Photo Credit: PTI)

సూర్యాపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి (17) గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురుకుల పాఠశాలలో శనివారం ఫేర్‌వెల్‌ డే ఉండగా విద్యార్థిని తండ్రి ఉదయం 9గంటలకు వచ్చి పూలు , గాజులు ఇచ్చి వెళ్లాడు.

సాయంత్రం పాఠశాల ఆవరణలో జరిగిన ఫేర్‌వెల్‌డేలో వైష్ణవి పాల్గొన్నది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి హాస్టల్‌ గదికి వెళ్లిపోయింది. గంట తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వైష్ణవి అపస్మారకస్థితిలో ఉంది.ఈ విషయాన్ని వారు వెంటనే ప్రిన్సిపల్‌తో పాటు సిబ్బందికి చెప్పడంతో వైష్ణవిని సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తెలంగాణలో దారుణం, మద్యం మత్తులో భర్తను చంపిన భార్య , వీడియో ఇదిగో..

వారం రోజుల క్రితం భువనగిరిలోని ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరుకముందే సూర్యాపేటలో మరో బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం కలకలం రేపింది.ప్రిన్సిపల్‌ తమ కూతురును వేధించారని,ఈ మనస్తాపంతో మృతిచెందిందని, తమ కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. వైష్ణవి మృతదేహంపై గాయాలు ఉండడంతో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement