Telangana Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, భార్యా పిల్లలను తుపాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్‌ గన్‌మెన్‌, కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు

భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

siddipet-collector-gunman-commits-suicide (Photo-Social Media)

Hyd, Dec 15: తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని (Siddipet) చిన్నకోడూరు మండలం రామునిపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద ఆకుల నరేశ్‌ అనే కానిస్టేబుల్‌ గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు... చిన్నకోడూర్‌ మండలం రామునిపట్ల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య చైతన్య, కుమారుడు రేవంత్‌, కుమార్తె హిమశ్రీ ఉన్నారు. శుక్రవారం నరేశ్‌ విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు.

పాకిస్తాన్‌లో దారుణం, పిల్లలను చంపి వారి మాంసాన్ని వండుకుతిన్న కసాయి, ఇంకా దారుణం ఏంటంటే స్థానిక దర్గా వద్ద ఆ మాంసాన్ని పంచిన కిరాతకుడు

భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆకుల నరేశ్‌ అనే కానిస్టేబుల్‌ కలెక్టర్‌ గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నరేశ్‌.. తన భార్య చైతన్య, కుమారుడు రేవంత్‌, కూతురు హిమశ్రీని తుపాకీతో కాల్చాడు. అనంతరం తానుకూడా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.



సంబంధిత వార్తలు