Pakistan Shocker: పాకిస్తాన్‌లో దారుణం, పిల్లలను చంపి వారి మాంసాన్ని వండుకుతిన్న కసాయి, ఇంకా దారుణం ఏంటంటే స్థానిక దర్గా వద్ద ఆ మాంసాన్ని పంచిన కిరాతకుడు
Representational Image | (Photo Credits: IANS)

ఇస్లామాబాద్ [పాకిస్తాన్], డిసెంబర్ 14 (ANI): పాకిస్తాన్ పంజాబ్‌లోని ముజఫర్‌గఢ్‌లో పిల్లలను చంపి (Man arrested for killing children) వారి మాంసాన్ని తిన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ARY న్యూస్ నివేదించింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు పిల్లలు ఐదు రోజుల క్రితం ముజఫర్‌గఢ్‌లోని ఖాన్ ఘర్ ప్రాంతం నుండి అపహరణకు గురయ్యారు.

నిందితులు ఆ ముగ్గురిలో ఇద్దరిని కిరాతకంగా హత్య చేశారు. పిల్లలు చంపి వారి మాంసాన్ని తిన్నారని (eating their flesh) ఆరోపించారు. అయితే, ARY న్యూస్ ప్రకారం, స్థానికులు అందించిన సమాచారంతో చర్య తీసుకున్న పోలీసులు ఏడేళ్ల అలీ హసన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల అబ్దుల్లా, అతని ఒకటిన్నర ఏళ్ల సోదరి హఫ్సాను చంపిన తర్వాత, ఆ వ్యక్తి వారి మాంసాన్ని వండుకుని తిన్నాడని అలీ హసన్ చెప్పాడు.

పాకిస్తాన్‌ ఆర్మీ కార్యాలయంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి, 23 మంది సైనికులు మృతి, మరో 30 మందికి తీవ్ర గాయాలు

అంతేకాకుండా, ముజఫర్గాలోని స్థానిక దర్గా వద్ద కూడా ఆ వ్యక్తి మానవ మాంసాన్ని పంచాడని ARY న్యూస్ నివేదించింది. నివేదిక ప్రకారం, ముజఫర్‌ఘర్ పోలీసులు అబ్దుల్లా యొక్క అవశేషాలను, కత్తులను పొలంలో నుండి స్వాధీనం చేసుకున్నారు, అయితే హఫ్సాను కనుగొనే శోధన కొనసాగుతోంది.పట్టుబడిన నిందితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతను స్పృహలోకి వచ్చిన తర్వాత దారుణ హత్యల గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తానని ARY న్యూస్ నివేదించింది.

తప్పిపోయిన పిల్లల తండ్రి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన నిందితుడిపై హత్య, ఉగ్రవాదం కింద కేసు కూడా నమోదు చేయబడింది. మైనర్ బాధితుల తండ్రి ఫయాజ్ కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు ARY న్యూస్ నివేదించింది