Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, తప్ప తాగి అర్థరాత్రి యువతి గదిలోకి దూరి..ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించిన యువకుడు, యువకుడిని పట్టుకుని చితకబాదిన కుటుంబ సభ్యులు

భాగ్య నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ఓ యువకుడు అర్థరాత్రి యువతి ఇంట్లోకి దూరి కత్తితో (Hyderabad man stabs woman) యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు.యువతి అరవడంతో తల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని (Hyderabad Shocker) పట్టుకుని చితకబాదారు.

Image used for representational purpose only. | (Photo Credits: Pixabay)

Amaravati, Oct 28: భాగ్య నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ఓ యువకుడు అర్థరాత్రి యువతి ఇంట్లోకి దూరి కత్తితో (Hyderabad man stabs woman) యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు.యువతి అరవడంతో తల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని (Hyderabad Shocker) పట్టుకుని చితకబాదారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పరిధిలోని వట్టినగులకపల్లకి చెందిన చెందిన ప్రేమ్ సింగ్ (21) కేపీహెచ్‌బీలోని ఎంఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గొడీల రూఖీ సింగ్ (21) మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతోంది. ఇద్దరూ బంధువులు కావడంతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వట్టినాగులపల్లికి చేరుకున్న ప్రేమ్ సింగ్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యువతి బెడ్ రూమ్ తలుపు తన్ని లోనికి చొరబడ్డాడు. కత్తితో యువతి గొంతు కోయడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది.

పిల్లోడు కాదు కామాంధుడు, యువతిని పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం, తిరగబడటంతో ఆమె చేతులు క‌ట్టేసి రాయితో దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

కుటుంబ సభ్యులు లేచి యువకుడిని పట్టుకుని చితకబాది బంధించారు. యువతికి గొంతు, అరచేయి, కాలు, మణికట్టు వద్ద కత్తి గాట్లు పడ్డాయి. చికిత్స నిమిత్తం యువతిని కాంటినెంటల్ హాస్పిటల్‌లో, యువకుడిని కిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. గంజాయి మత్తులో ప్రేమ్ సింగ్ ఘటకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గచ్చిబౌలి ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement