Telangana Shocker: పెళ్లన్నాడు..హోటల్లో కామవాంఛలు తీర్చుకున్నాడు, ఆ తర్వాత కులం పేరు ఎత్తాడు, పెళ్లై పిల్లలన్న వ్యక్తి చేతిలో మోసపోయిన యువతి, నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు

పెళ్లై పిల్లలున్న ఆ విషయాన్ని దాచి పెట్టి ఓ యువతిని పెళ్లి పేరుతో లొంగ దీసుకుని కామవాంఛలు తీర్చుకున్న ప్రబుద్ధుడిని (Telangana Shocker) బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Hyderabad, Sep 8: పెళ్లై పిల్లలున్న ఆ విషయాన్ని దాచి పెట్టి ఓ యువతిని పెళ్లి పేరుతో లొంగ దీసుకుని కామవాంఛలు తీర్చుకున్న ప్రబుద్ధుడిని (Telangana Shocker) బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి మెయిన్‌ ఓపీ ఫార్మసీలో జూనియర్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న కొండబాబు ఓ యువతితో 2018 మార్చిలో పరిచయం ఏర్పడింది.

తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించిన కొండబాబు ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని (Man cheats woman) నమ్మించాడు. 2020 జూలైలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఫార్చున్‌ వల్లభ హోటల్‌కు తీసుకెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత కొండబాబుకు పెళ్లై పిల్లలు కూడా ఉన్న విషయాన్ని బాధితురాలు తెలుసుకొని నిలదీసింది. తన భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ మరోసారి వంచించడమే కాకుండా పలుమార్లు అదే హోటల్‌లో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు.

నన్ను పెళ్లి చేసుకో, లేదంటూ చంపేస్తా, వివాహితను బెదిరించిన యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ నెల 6వ తేదీన బాధిత యువతి పెళ్లి మాట ఎత్తేసరికి కులం పేరు ఎత్తాడు. తాను కేవలం శారీరక వాంఛల కోసమే ఇన్నాళ్లు తిరిగానని, పెళ్లి కోసం కాదన్నాడు. దీంతో బాధితురాలు తాను మోసపోయా­నని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా కొండబాబుపై ఐపీసీ సెక్షన్‌ 376(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement