Taskforce of Telangana raids, exposes the Food Safety violations of Nimrah Cafe and Bakery and Arabiana Restaurant Charminar, Hyderabad

Hyderabad, Mar 8: ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు (Hotels), రెస్టారెంట్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో రెస్టారెంట్లు శుచీ, శుభ్రతను గాలికి వదిలేస్తున్నాయి. ఈ క్రమంలో పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బల్దియా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తరచూ హోటల్స్ లో తనిఖీలు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అమీర్‌ పేటలోని అమోఘ, తాజా కిచెన్‌, మెహిదీపట్నంలోని 4 సీన్స్‌ మల్టీకజిన్‌ రెస్టారెంట్‌ లో తనిఖీ చేశారు. ఆయా హోటల్స్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్‌ లో ఘటన (వీడియో వైరల్)

Here's Video:

హోటల్స్ లో ఏం గమనించారు?

అధికారులు తాజాగా రైడ్స్ చేసిన హోటల్స్, రెస్టారెంట్స్ లో వెజ్, నాన్‌వెజ్ ఒకే దగ్గర మిక్స్ చేసి వంటలు చేస్తున్నట్టు తేలింది. కిచెన్‌ లో బొద్దింకలు, ఎలుకలు కనిపించాయి. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్‌ అన్ని ఒకే దగ్గర కలిపి నిల్వ చేస్తున్న రెస్టారెంట్ యాజమాన్యాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కాలంచెల్లిన వస్తువులు కూడా గుర్తించారు.

టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?