Image used for representational purpose only. (Photo Credits: ANI)

Hyderabad, Sep 8: వివాహితను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించిన ఘటనలో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు (Hyderabad Shocker) చేశారు. జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కాలనీకి చెందిన అరుణ్‌కుమార్‌ త్యాగి(47) స్థానికంగా యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు. అందులో భాగస్వామిగా ఉన్న వివాహితను పెళ్లి పేరుతో వేధింపులకు (marry a married man) గురి చేశాడు. అనంతరం చేతులు కోసుకుని చనిపోతానంటూ బెదిరించాడు.

బాధితురాలు జూన్‌ 26న జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకి పంపారు. అనంతరం జులై 28న బెయిలుపై బయటికి వచ్చిన నిందితుడు తిరిగి ఆమెను వేధించం మొదలు పెట్టాడు. కేసును వెనక్కి తీసుకోవాలని, తనని వివాహం చేసుకోవాలని.. లేదంటే చంపేస్తానంటూ బాధితురాలిని బెదిరించాడు.

ఇదో రకం మోసం, ఎన్ఆర్ఐ యువతినంటూ అమ్మాయిలతో ఛాటింగ్, న్యూడ్ ఫోటోలు పంపాలని బ్లాక్ మెయిల్, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

మరో మహిళకు సైతం ఫోన్‌లో అసభ్య సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో ఇరువురి ఫిర్యాదుతో పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.