Telangana Shocker: దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై వృద్ధులు గ్యాంగ్ రేప్, రాత్రంతా రూంలో బంధించి అత్యాచారం, తెలంగాణలో షాకింగ్ ఘటన వెలుగులోకి
తండ్రి, తాత వయసులో ఉన్న ఆ కామాంధులు మతిస్థిమితం లేని విద్యార్థిని అని కూడా చూడకుండా పశువుల్లా మీదపడి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి (Two Old mans rapes mentally disabled girl) పాల్పడ్డారు.
Sangareddy, May 2: తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో దారుణం (Telangana Shocker) చోటు చేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయి.. చిన్నమ్మ దగ్గర ఉంటున్న ఓ మానసిక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తండ్రి, తాత వయసులో ఉన్న ఆ కామాంధులు మతిస్థిమితం లేని విద్యార్థిని అని కూడా చూడకుండా పశువుల్లా మీదపడి అఘాయిత్యానికి (Two Old mans rapes mentally disabled girl) పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy) కేంద్రంలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ రమేష్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జిల్లా కేంద్రానికి చెందిన మానసిక, శారీరక వికలాంగురాలైన యువతి (20) తల్లిదండ్రులు చనిపోవడంతో తన చిన్నమ్మ దగ్గర ఉంటుంది. ఆమె పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ పాఠశాలలో చదువుకుంటుంది. పుల్కల్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన కలకుంట్ల రాములు (48) సంగారెడ్డిలో అడ్డ మీద కూలిగా పని చేస్తున్నాడు. అతడికి సంగారెడ్డి పట్టణంలోని దీన్దార్ ఖాన్ ఫంక్షన్ హాల్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అమృద్ బీన్ అహ్మద్ అలియాస్ చావుస్ (65) మంచి స్నేహితుడు. అయితే రాములు కన్ను మానసిక వికలాంగ విద్యార్థిపై పడింది. అదును కోసం ఎదురుచూస్తున్న రాములు ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటల సమయంలో యువతికి మాయమాటలు చెప్పి అక్కడినుంచి తన స్నేహితుడు పనిచేస్తున్న ఫంక్షన్ హాల్‌కు తీసుకెళ్లాడు.
అక్కడ వీరిద్దరూ యువతిని ఓ రూములోకి తీసుకెళ్లారు. ఆమెకు కొన్ని పండ్లు తినిపించి, అనంతరం ఒకరి తర్వాత ఒకరు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అదే రోజు రాత్రి మళ్లీ ఆ యువతికి అన్నం తినిపించి మరోసారి ఇద్దరు లైంగిక దాడి చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ఆ యువతిని వదిలేశారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆ యువతి ఈ విషయాన్ని మొత్తం తన చిన్నమ్మకు చెప్పింది. వెంటనే ఆమె సంగారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్ ఆదివారం నిందితుల్లో ఒకడైన అమృద్ బిన్ అహ్మద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడైన రాములు పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. తండ్రిలాంటి వ్యక్తులే యువతిపై లైంగిక దాడికి పాల్పడడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.