Telangana Group-1 Notification Cancelled: తెలంగాణలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ, కొత్త నోటిఫికేషన్‌ త్వరలో జారీ చేసే అవకాశం

2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

TSPSC (Photo-Wikimedia Commons)

TSPSC Group-1 Notification Cancelled: తెలంగాణలో గత ప్రభుత్వం 2022లో విడుదల చేసిన పాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ సోమవారం రద్దు చేసింది.ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక.. త్వరలో 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో 60 గ్రూప్‌-1 పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..

గ్రూప్‌-1కు సంబంధించి పూర్తి వివరాలపై కమిషన్‌ విచారణ జరుపుతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పూర్తిస్థాయి విచారణ తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని కమిషన్‌ వెల్లడించింది.అయితే, పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి, నిబంధనలు సరిగా పాటించలేదని ఇంకోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల మరో 60 గ్రూప్‌ -1 పోస్టులకు కొత్త ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టులకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.