Woman Murdered by FB Friend: ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికోసం ఇద్దరు పిల్లలను వదిలి పారిపోయిన మహిళ, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో బండరాయితో కొట్టిచంపిన ప్రియుడు

ఫేస్‌బుక్‌లో పరిచయమైన (FB friend) యువకుడితో వివాహిత ప్రేమలో పడింది. అతన్ని వెతుక్కుంటూ భర్త, పిల్లలను వదిలి వెళ్లింది. తీరా ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ కు (Nizamabad) చెందిన ఉస్మా బేగం(32) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Image used for representational purpose (Photo Credits: Pixabay)

Amroha, NOV 13: ఫేస్‌బుక్‌లో పరిచయమైన (FB friend) యువకుడితో వివాహిత ప్రేమలో పడింది. అతన్ని వెతుక్కుంటూ భర్త, పిల్లలను వదిలి వెళ్లింది. తీరా ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ కు (Nizamabad) చెందిన ఉస్మా బేగం(32) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాన్సువాడలో (Banswada) నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా కొంతకాలంగా ఉస్మా బేగం పుట్టింట్లోనే ఉంది. పెద్దలు రాజీ కుదర్చడంతో ఈనెల 4న భర్త నివాసముండే బాన్సువాడకు వెళ్లింది. రెండు రోజుల తరువాత కనిపించక పోవటంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. గత రెండు రోజుల క్రితం యూపీలో ఉస్మాబేగం హత్యకు గురైనట్లు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. యూపీలోని అమ్రోహా (Amroha) జిల్లాలో గజరౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ మేట్ సెక్యూరిటీ కంపెనీ ఆవరణలో మూడు రోజుల కిందట మహిళ మృతదేహాన్ని యూపీ పోలీసులు గుర్తించారు.

Delhi Shocker: చనిపోయిన తండ్రిని బ్రతికించుకునేందుకు రెండు నెలల చిన్నారిని నరబలి ఇచ్చే యత్నం, పోలీసుల రంగ ప్రవేశంతో ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి, ఢిల్లీలో విస్తుపోయే ఘటన 

షెహజాద్ అనే యువడిపై అనుమానంతో విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉస్మా బేగం (Uzma Begum) ఫేస్ బుక్ లో పరిచయమైందని, పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలిపాడు. కొద్దిరోజుల క్రితం తన సూచన మేరకు ఉస్మాబేగం తన కుటుంబాన్ని వదిలేసి తన వద్దకు వచ్చిందని నిందితుడు తెలిపాడు.

Accident: అర్ధరాత్రి నెత్తురోడిన సూర్యాపేట.. మునగాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం.. అయ్యప్ప స్వామి పడిపూజకు హాజరై వస్తుండగా.. రాంగ్ రూట్‌లో ప్రయాణించిన ట్రాక్టర్.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం 

అయితే, వచ్చిన దగ్గర నుంచి పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కోపంతో ఆమెను ఇటుకతో తలపై చితకబాది హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. ఆ తరువాత కంపెనీ ఆవరణలో ఓ మూలన మహిళ మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో హంతకుడు వెల్లడించాడు. యూపీ పోలీసుల సమాచారం మేరకు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు మృతురాలి తల్లిదండ్రులు యూపీకి వెళ్లారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement