Gongadi Trisha: అండర్-19 టీ20 వరల్డ్ కప్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' హైదరాబాద్ కు.. తెలుగమ్మాయి త్రిషకు ఘన స్వాగతం.. ఇదిగో వీడియో!
మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి గొంగడి త్రిష తాజాగా హైదరాబాద్ కు వచ్చారు.
Hyderabad, Feb 4: మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో (T20 Worldcup) అద్భుతమైన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు. సదరు టోర్నమెంట్ ఆసాంతం రాణించిన త్రిష ఆల్ రౌండర్ ప్రదర్శనతో భారత్ కు రెండోసారి ప్రపంచకప్ అందించడంతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గాను నిలిచారు. భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషను ఆదర్శంగా తీసుకుని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. త్రిషతో పాటు ద్రితి కేసరి ఉన్నారు.
నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)
Here's Video:
త్రిష రికార్డులు ఇవి..
ఈ వరల్డ్ కప్ లో త్రిష మొత్తం 309 పరుగులు చేసింది. బౌలింగ్ లో 7 వికెట్లు తీసి సత్తా చాటింది. అంతేగాక ఈ టోర్నీలో నమోదైన ఏకైక శతకం చేసింది కూడా మన త్రిషనే.
ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ
అలా ప్రస్థానం
త్రిష స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం. రెండేళ్ల వయసుకే బ్యాట్ పట్టిన త్రిష... 9 ఏళ్లకే హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడి సత్తా చాటింది. ఆ తర్వాత అండర్-23 కేటగిరీలోనూ ఆడింది. 19ఏళ్లకే స్టార్ క్రికెటర్ గా, టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఎదిగారు త్రిష.