Ratha Saptami (Credits: X)

Vijayawada, Feb 4: నేడు రథ సప్తమి (Ratha Saptami). ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల (Tirumala), శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి  ఊరేగింపు ఉంటుంది. సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభమవుతాయి. అటు అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, గోవిందరావు, గౌతు శిరీష పాల్గొన్నారు. 7 గంటలకు ప్రారంభం కానున్న స్వామివారి నిజరూప దర్శనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ

అరసవల్లికి నిధులు

ఆలయ అభివృద్ధికి కేంద్రం కూడా ప్రసాదం పథకం కింద నిధులు కేటాయిస్తుందని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.  దేవాలయాలను కాపాడుకుని మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వీడియో ఇదిగో, విజయవాడలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వాలంటీర్ హంగామా, వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్

--తిరుమలలో రథసప్తమి వాహన సేవల వివరాలు--

  • ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం
  • ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం
  • మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం
  • మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం
  • సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు -  కల్పవృక్ష వాహనం
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం
  • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు -చంద్రప్రభ వాహనం