విజయవాడ బందర్ రోడ్‌లో పెట్రోల్ పోసుకుని యువకుడు హల్చల్ చేశాడు. వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలంటూ నడి రోడ్డుపై ఫ్లెక్సీతో నిరసన తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటానని బెదిరించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాలంటీర్ ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని వాపోయాడు.

విశాఖ జిల్లా గాజువాకలో దారుణం..యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే..?

కూటమి సర్కారు ఎన్నికల సమయంలో  తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించటంతో పాటుగా వారికి రూ 10 వేలు చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు వాలంటీర్ల కొనసాగింపు పైన స్పష్టత ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశాల్లో చర్చకు వచ్చినా నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో వాలంటీర్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు.

ఇక మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసలు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అమల్లో లేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 2023 ఆగస్టు తరువాత వాలంటీర్లు రెన్యువల్ కాలేదని.. ఈ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేసారు. అసలు అమల్లోనే లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు.

Volunteer pours petrol on body, creates ruckus on Vijayawada Bandar Road

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)