Telangana Integration Day: అటు సమైక్యతా వజ్రోత్సవాలు.. ఇటు విమోచన దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
Hyderabad, September 17: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ స్టేడియం, పరేడ్ గ్రౌండ్‌లో పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంకు వచ్చే చుట్టూ పక్కల మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
ఆంక్షలు.. మళ్లింపులు ఇలా..
-కవాడిగూడ ఎక్స్‌రోడ్స్ నుంచి షెయిలింగ్ క్లబ్, లోయర్ ట్యాంక్ బండ్‌కు ట్రాఫిక్ అనుమతి లేదు. ఈ వాహనాలను కవాడిగూడ ఎక్స్ రోడ్స్ నుంచి బైబిల్ హౌస్ వైపు మళ్లిస్తారు.
-అశోక్‌నగర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వైపు అనుమతి లేదు. ఈ వాహనాలను బాకారం బ్రిడ్జి నుంచి సీజీవో టవర్స్ బన్సీలాల్‌పేట్ వైపు మళ్లిస్తారు.
-ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వైపు ట్రాఫిక్‌కు అనుమతించరు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద నుంచి నారాయణగూడ క్రాస్‌రోడ్డు వైపు మళ్లిస్తారు.
-ఆజామాబాద్ జంక్షన్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వైపు ట్రాఫిక్ అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను వీఎస్‌టీ క్రాస్‌రోడ్స్ నుంచి బాగ్‌లింగంపల్లి వైపు మళ్లిస్తారు.
-సాధురామ్ కంటి ఆస్పత్రి నుంచి ఏవీ కాలేజీ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వైపు ట్రాఫిక్ అనుమతించరు. దోమల్‌గూడ టీ జంక్షన్ నుంచి చిక్కడపల్లి మెట్రో స్టేషన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డువైపు మళ్లిస్తారు.
-లిబర్టీ నుంచి అప్పర్‌ట్యాంక్ బండ్‌కు ట్రాఫిక్‌ను అనుమతించరు. లిబర్టీ వద్ద హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
-ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. పాత సచివాలయం గేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా లిబర్టీ వైపు మళ్లిస్తారు.
-నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు.. అక్కడి నుంచి ఎన్టీఆర్ స్టేడియం వైపు వాహనాలకు అనుమతి లేదు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ఆ వాహనాలను ముషీరాబాద్ వైపు మళ్లిస్తారు.
-రాణిగంజ్, ఎంజీరోడ్డు, ఆర్పీరోడ్డు నుంచి అప్పర్ ట్యాంక్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఈ వాహనాలను కర్బాలా మైదాన్ నుంచి బైబిల్ హౌస్, ముషీరాబాద్ వైపు మళ్లిస్తారు.
-తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఇక్బాల్ మినార్ (రవీంద్రభారతి) నుంచి కట్టమైసమ్మ వైపు అనుమతిలేదు.
-కట్టమైసమ్మ ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వెళ్లే రోడ్డు మూసి ఉంటుంది.
-నెక్లెస్ రోడ్డు కూడా రెండు వైపులా మూసి ఉంటుంది. ట్రాఫిక్‌కు అనుమతి ఉండదు.
ఈ జంక్షన్ల నుంచి వెళ్లకపోవడం మంచిది
సాధారణ వాహనాదారులు ఎన్టీఆర్ స్టేడియంకు మూడు కిలోమీటర్ల పరిధిలోని అంబేద్కర్ విగ్రహం, కవాడిగూడ ఎక్స్ రోడ్, ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్‌బండ్, లోయర్ ట్యాంక్‌బండ్, లిబర్టీ, నెక్లెస్ రోడ్, అశోక్‌నగర్, ఇందిరా పార్కు, రవీంద్రభారతి, ఇక్బాల్ మినార్, ముషీరాబాద్,ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, బషీర్‌బాగ్, రాణిగంజ్, బైబిల్ హౌస్, కర్బలా మైదాన్, ఖైతరాబాద్ జంక్షన్, పోలీస్ కంట్రోల్ రూమ్, ఎల్బీస్టేడియం, వీఎస్టీ, గాంధీనగర్, హిమాయత్ నగర్, హైదర్‌గూడ, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజీ జంక్షన్ల నుంచి వెళ్లవద్దని పోలీసులు సూచించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)