Sadar Utsav Mela: ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్ లో ‘సదర్’ ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 3 వరకు ట్రాఫిక్ మళ్లింపు.. పూర్తి వివరాలు ఇదిగో!
సదర్ ఉత్సవ మేళాను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని నిర్ణయించారు.
Hyderabad, Nov 14: సదర్ ఉత్సవ మేళా (Sadar Utsav Mela)ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ (Hyderabad) పోలీసులు (Police) ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం వేకువజామున 3 గంటలకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
Viral News: భార్య పుట్టిన రోజును మర్చిపోతే ఐదేండ్ల జైలు.. భయపడకండి మనదగ్గర కాదులే.. మరెక్కడ??
ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతాలు ఇవే...
- బర్కత్‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. బర్కత్‌పురా క్రాస్ రోడ్స్, టూరిస్ట్ హోటల్ నుంచి మళ్లించనున్నారు.
- కాచిగూడ క్రాస్ రోడ్స్ నుంచి వైఎంసీఏ రూట్‌లో వచ్చే వాహనాలను టూరిస్ట్ హోటల్ రోడ్‌లో దారి మళ్లింపు.
- సదర్ మేళాకు వచ్చే వాహనాలను శాంతి థియేటర్, రెడ్డి కాలేజ్, మెల్కొటే పార్క్, దీపక్ థియేటర్ పార్కింగ్ ఏరియాల్లో పార్క్ చేయాల్సి ఉంటుంది.
- స్ట్రీట్ నంబర్ 8 నుంచి వైఎంసీఏ వైపు ప్రవేశం లేదు. రెడ్డి కాలేజ్ వద్ద బర్కత్‌పురా వైపు మళ్లీస్తారు.
- బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి కాలేజి వైపు వచ్చే వాహనాలకు ఎంట్రీ లేదు. నారాయణగూడ క్రాస్ రోడ్స్ మీదుగా మళ్లించనున్నారు.
- ఓల్డ్ ఎక్సైజ్ ఆఫీస్ నుంచి వచ్చే వాహనాలను విఠల్‌వాడి మీదుగా మళ్లిస్తారు.
- సికింద్రాబాద్ నుంచి కోఠి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నారాయణగూడ క్రాస్ రోడ్స్, బర్కత్‌పురా, బాగ్‌లింగంపల్లి, వీఎస్‌టీ, ఆర్టీసీ రోడ్స్ మీదుగా మళ్లించనున్నారు.
- విఠల్‌వాడి క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహన ట్రాఫిక్‌ను భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్, కింగ్‌కోటి మీదుగా మళ్లీంపు.
- ఓల్డ్ బర్కత్‌పురా పోస్టాఫీస్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్‌ను క్రౌన్ కేఫ్, బాగ్ లింగంపల్లి వైపు మళ్లింపు.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Drugs Seize In KPHB: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం, కేపీహెచ్బీలో ఒక వ్యక్తి నుంచి 13 గ్రాముల ఎంఎండీఏ సీజ్
Raids In Hyderabad Hotels: హైదరాబాద్ లోని హోటళ్లలో పరిశుభ్రత గాలికి.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు.. వీడియోతో
Advertisement
Advertisement
Advertisement