Traffic Alert in Hyderabad: హైదరాబాద్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది.
Hyderabad, Nov 7: హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి ప్రధాని మోదీ (PM Modi) హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ సమయంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కన ప్రాంతాల్లో రహదారుల మూసివేత, దారిమళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఈ మార్గాల్లో ఆంక్షలు..
- ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ కు అనుమతి ఉండదు.
- వాహనాలను నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
- అబిడ్స్, గన్ ఫౌండ్రి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.
- ఈ వాహనాలను ఎస్‌బీఐ గన్ ఫౌండ్రి నుంచి చాపల్ రోడ్డులోకి మళ్లిస్తారు.
- ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్ వద్ద హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement