Telangana: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ సీఐడీ డీజీపీ భార్య మృతి,సీఐడీ డీజీపీ గోవింద్‌ సింగ్‌‌కు తీవ్ర గాయాలు

తెలంగాణ సీఐడీ డీజీపీ గోవింద్‌ సింగ్‌ రాజస్తాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జైసల్మేర్‌ జిల్లాలోని తనోత్‌ మాత ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తుండగా.. రాంఘర్‌-టానోట్ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న మహీంద్రా కారు బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గోవింద్‌ సింగ్‌ భార్య షీలా సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

TS top cop Govind Singh (Photo-Twitter)

తెలంగాణ సీఐడీ డీజీపీ గోవింద్‌ సింగ్‌ రాజస్తాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జైసల్మేర్‌ జిల్లాలోని తనోత్‌ మాత ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తుండగా.. రాంఘర్‌-టానోట్ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న మహీంద్రా కారు బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గోవింద్‌ సింగ్‌ భార్య షీలా సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో తాంత్రిక పూజలు, 3 నెలలకోసారి నల్లపిల్లితో కేసీఆర్ పూజలు చేస్తున్నారని ఆరోపణ

ప్రమాదంలో గోవింద్‌ సింగ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జవహర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోవింద్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సీఐడీ విభాగం చీఫ్‌ గోవింద్ సింగ్ సతీమణి మరణించడంపై డీజీపీ మహేందర్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న తమ సహచర సీనియర్ అధికారి గోవింద్ సింగ్ త్వరితగతిన కోలుకోవాలని డీజీపీ ఆకాంక్షించారు.

.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement