Mysterious Object in Vikarabad (Photo-Video Grab)

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఆకాశం నుంచి ఓ వింత వస్తువు పడిపోయింది. చూడ్డానికి ఓ టైమ్ మెషీన్ ఆకారంలో ఉన్న ఈ వస్తువును చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ భారీ వస్తువు ఇక్కడి పొలాల్లో కూలిపోగా రైతులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పొలాల వద్దకు చేరుకుని ఆ వస్తువును పరిశీలించిన అధికారులు అది వాతావరణ మార్పులను పరిశీలించేందుకు ప్రయోగించిన హీలియం బెలూన్ అని వెల్లడించారు.

షాకింగ్ వీడియో, రైలు ఎక్కుతుండగా ఫుట్‌పాత్‌, రైలు మధ్యలో ఇరుక్కుపోయిన విద్యార్థిని, క్షేమంగా బయటకు తీసిన రైల్వే అధికారులు

వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం ఇలాంటి బెలూన్లను గగనతలంలోకి ప్రయోగిస్తుంటారని తెలిపారు. మొగిలిగుండ్ల వద్ద కూలిపోయిన బెలూన్ ను టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ పంపించినట్టు వెల్లడించారు. ఆ పరికరం స్పెయిన్‌ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్‌ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు.

టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం దినివల్ల  ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో  నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది.

షాకింగ్ వీడియోలు, వారికి నిజంగానే జాంబీ వైరస్‌ సోకిందా, ఫిలడెల్ఫియాలో రోడ్లపై చిత్ర విచిత్రంగా నడుస్తున్న వీడియోలు వైరల్, డ్రగ్స్ తీసుకున్న వారు అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు

బెలున్ సహాయంతో ప్రయోగించాం. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనివద్దనే దీగేలా చూశాం అని సైంటిస్టులు ప్రకటించారు.