గాజువాకలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ చోటుచేసుకుంది. గుంటూరు-రాయగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దువ్వాడకు వచ్చింది. ఈ సందర్భంగా ప్లాట్‌ఫామ్‌ మీద నుంచి రైలు ఎక్కుతున్న క్రమంలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని శశికళ కిందపడిపోయింది. ఈ క్రమంలో ఫుట్‌పాత్‌, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో, బయటకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. విద్యార్ధిని రైలు మధ్యలో పడిపోవడంతో ఆమెను బయటకు తీసెందుకు రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం, హుటాహుటిన ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)