Fire in TSRTC Bus: టీఎస్ఆర్టీసీ రాజధాని ఎక్స్ ప్రెస్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణ నష్టం.. గుంటూరు సమీపంలో ఘటన (వీడియోతో)
టీఎస్ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. అయితే, డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Hyderabad, July 7: టీఎస్ఆర్టీసీ (TSRTC) బస్సులో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మంటలు ఎగిసి పడడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. అయితే, డ్రైవర్ (Driver) అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఎక్స్ ప్రెస్ (Rajadhani Express) బస్సు హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడ (Vijayawada) వెళ్తుండగా గుంటూరు సమీపంలో ఒక్కసారిగా బస్సుకు మంటలు అంటుకున్నాయి.
మిర్రర్ లో మంటలను చూసి..
డ్రైవర్ మిర్రర్ లో మంటలను చూసి బస్సు ఆపి.. ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement