Google Layoffs: గూగుల్ ఉద్యోగులకు మరోసారి షాక్, త్వరలో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలిపిన సీఈఓ సుందర్ పిచాయ్, ప్రియారిటీ ఆధారంగా పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడి

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌ ఇటీవల భారీ లేఆఫ్స్ ప్రకటించిన సంగతి విదితమే. ఈ ఏడాది మొదట్లో సుమారు 12వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమైంది. గూగుల్‌లో త్వరలో మరిన్ని తొలగింపులు ఉండొచ్చని గూగుల్‌ సీఈవో (Google CEO) సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) తాజాగా ప్రకటించారు.

Sundar Pichai (Photo Credits : Sundar Pichai / Instagram)

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌ ఇటీవల భారీ లేఆఫ్స్ ప్రకటించిన సంగతి విదితమే. ఈ ఏడాది మొదట్లో సుమారు 12వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమైంది. గూగుల్‌లో త్వరలో మరిన్ని తొలగింపులు ఉండొచ్చని గూగుల్‌ సీఈవో (Google CEO) సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) తాజాగా ప్రకటించారు. ఇటీవల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఈవో ఈ మేరకు హింట్‌ ఇచ్చారు.

ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ChaosGPT, ఈ భూగ్రహాన్ని అంతం చేయడమే దాని లక్ష్యం, అసలు ChaosGPT అంటే ఏమిటి ఓ సారి తెలుసుకుందాం

ఇంటర్వ్యూలో భాగంగా పిచాయ్‌ మాట్లాడుతూ.. గూగుల్ (Google) యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ బార్డ్, జీమెయిల్(Gmail), గూగుల్ డాక్స్, ఇతర ప్రాజెక్ట్‌ల సామర్ధ్యాలు, అవకాశాలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. ప్రస్తుతానికి కంపెనీ దృష్టంతా ఆపరేషన్స్‌పైనే ఉందని, పనులు వేగవంతంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రియారిటీ ఆధారంగా పనులు పూర్తి చేస్తున్నామని ఈ సమయంలోనే లేఆఫ్‌లు కూడా ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు.

ఆన్‌లైన్ గేమింగ్ కోసం కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి, కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్ర ఐటీ శాఖ, బెట్టింగ్,జూదం లేని గేమ్స్‌కే అనుమతి

ప్రస్తుతం కన్నా 20% సమర్థంగా పని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు. రోజురోజుకీ పనులు వేగం పుంజుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు. ఖర్చులను కూడా అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సుందర్‌ పిచాయ్‌ ప్రకటనతో గూగుల్‌ ఉద్యోగుల్లో మరోసారి లేఆఫ్స్‌ భయాలు మొదలయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement