Sim Verification: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఇక చాలా ఈజీ, తెలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా tafcop.dgtelecom.gov.in ను అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ

ఈ పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడమనేది (How to know) చాలా ముఖ్యమైన విషయంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా మొదట ఏపీ, తెలంగాణలోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకునేందుకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది.

SIM Card Fraud (Photo Credits: Twitter)

మనకు తెలియకుండానే ఒక్కోసారి మనం చాలా నంబర్లు తీసేసుకుంటాం. ఈ నేపథ్యంలోనే పాత నంబర్‌ని మరచిపోతుంటాం. ఆఫర్ల పేరుతో పాత సిమ్ మూలన పడేసి కొత్త సిమ్ తీసుకుంటూ ఉంటారు. అది ఆఫర్ అయిపోగానే మరో సిమ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మన పేరు మీద (how many SIM cards are activated with Your Name) కొందరు హ్యాకర్లు మనకు తెలియకుండానే సిమ్ కార్డులు (SIM cards) తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

మరి, ఈ పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడమనేది (How to know) చాలా ముఖ్యమైన విషయంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా మొదట ఏపీ, తెలంగాణలోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకునేందుకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది. మనం ప్రస్తుతం వాడే ఫోన్ నంబర్‌ని ఎంటర్ చేయాలి. మీ నంబరుకు ఓటిపీ వస్తుంది. దాంతో లాగిన్ అవ్వాలి.

డెబిట్‌ కార్డ్ మీద ఈఎంఐ ఎలా తీసుకోవాలి, మీ డెబిట్ కార్డుకు అర్హత ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, డెబిట్ కార్డ్ ఈఎంఐ గురించి ముఖ్యమైన సమాచారం మీకోసం

ఒక సారి సైట్‌లోకి లాగిన్‌ అవగానే మన పేరు మీద ఎన్న నంబర్లు ఉన్నాయనే విషయం డిస్‌ప్లే అవుతుంది. అక్కడ ఇది నా నంబరు కాదు, అవసరం లేదు, అవసరం ఇలా మూడు ఆప్షన్లు ఇంగ్లీష్‌లో వస్తాయి, ఇందులో అసరం లేదు, మనకు తెలియకుండానే మన పేరు మీద రిజిస్ట్రర్‌ అయిన నంబర్లను తొలగించుకునే ఆప్షన్‌ ఉంటుంది. మనకు తెలియని ఏదైనా నంబర్ మన పేరు మీద నమోదు అయి ఉందని తెలిస్తే. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది. అయితే ఏపీలో తెలంగాణలో రిజిస్టర్ అయిన నంబర్లు మాత్రమే చూపిస్తుంది. వేరే రాష్ట్రాల్లో మీరు సిమ్ తీసుకుని ఉంటే అది ఇందులో చూపించదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement