6G Mission in India: భారత్‌లో 6జీ వచ్చేస్తోంది, ఈ దశాబ్దం భారత సాంకేతిక దశాబ్దం అని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

దేశం టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతోంది. 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు.

PM Modi (Photo-ANI)

New Delhi, Mar 23: దేశం టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతోంది. 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్‌ సంఘం(ఐటీయూ) ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను బుధవారం ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు.

4జీ కంటే ముందు టెలికం సాంకేతికతలో భారత్‌ కేవలం ఒక యూజర్‌గా ఉండేది. కానీ ఇప్పుడు భారీ టెలికం టెక్నాలజీని ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేశీయంగా అభివృద్ధిని సాధించిన టెక్నాలజీ వైపు ప్రపంచం దృష్టి సారించిందని అన్నారు.

ఆగని లేఆఫ్స్, 2,200 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ జాబ్ పోర్టల్ Indeed, చాలా బాధగా ఉందని తెలిపిన సీఈఓ క్రిస్ హైమ్స్

ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 85 కోట్లకు పెరిగింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో మొత్తంగా 25 లక్షల కి.మీ.ల ఆప్టికల్‌ ఫైబర్‌ వేశాం. త్వరలో వంద 5జీ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తాం. దేశీయ అవసరాల తీర్చేలా 5జీ అప్లికేషన్లను ఇవి అభివృద్ధిచేస్తాయి. దేశంలో 5జీ సేవలు మొదలైన 120 రోజుల్లోనే 125 నగరాలకు విస్తరింపజేశాం. ఈ దశాబ్దం భారత సాంకేతిక దశాబ్దం(టెక్‌ఏడ్‌)’ అని మోదీ అభివర్ణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement