SBI Users Alert: మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది, ఈ మెసేజ్ వస్తే రెస్సాండ్ కావొద్దని హెచ్చరికలు జారీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం

మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది’ అంటూ మొబైల్ కు మెస్సేజ్ వచ్చిందా..? అయితే, దాన్ని పట్టించుకోవద్దని తెలిపింది.

SBI (Photo Credits: PTI)

కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు హెచ్చరికలు (SBI Users Alert) జారీ చేసింది. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది’ అంటూ మొబైల్ కు మెస్సేజ్ వచ్చిందా..? అయితే, దాన్ని పట్టించుకోవద్దని తెలిపింది. ఎస్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఖాతాదారులకు ఇదే (Govt warning SBI users) సూచిస్తోంది. సైబర్ నేరస్థులు దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వేల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎస్బీఐ తన ఖాతాదారులకు తరచూ ఈ విధమైన హెచ్చరికలు, సూచనలు చేస్తూనే వస్తోంది. తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నుంచి ఒక ప్రకటన విడుదలైంది. 'ఖాతా బ్లాక్ చేశామంటూ స్కామర్లు ఎస్ఎంఎస్ లు పంపిస్తున్నారు. ఈ తరహ ఎస్ఎంఎస్ లు, కాల్స్ కు స్పందించొద్దని' ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. అలాగే, వచ్చిన ఎస్ఎంఎస్ లోని లింక్ పైనా క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల సమాచారం కోరుతూ వచ్చే మెయిల్స్, ఎస్ఎంఎస్ లకు స్పందించొద్దు.

ఈ నంబర్లు నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ చేయండి, ఖాతాదారులకు అలర్ట్ మెసేజ్ జారీ చేసిన SBI, ఎస్‌బీఐ కేవైసీ వెరిఫికేషన్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిక

ఈ తరహా ఏవైనా మెయిల్స్, ఎస్ఎంఎస్ లు వస్తే ఖాతాదారులు.. report.phishing @sbi.co.in కు తెలియజేయాలి’’ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సూచించింది. లింక్ ను క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేషన్ అవుతుందన్న సమాచారాన్ని కూడా నమ్మొద్దని పేర్కొంది.



సంబంధిత వార్తలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్