US Green Card Curbs: అమెరికా గ్రీన్ కార్డ్ నిషేధంపై స్పందించిన టీసీఎస్.. త్వరలో భర్తీ చేయబోయే 15 వేల ఉద్యోగాలు అమెరికన్లకే ఇస్తామని స్పష్టం చేసిన టెక్ దిగ్గజం..
అమెరికా ప్రభుత్వం విదేశీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ (PERM లేబర్ సర్టిఫికేషన్) ప్రక్రియపై విధించిన సస్పెన్షన్ నిర్ణయం తమ కంపెనీ కార్యకలాపాలపై గానీ, క్లయింట్ సేవలు , వర్క్‌ఫోర్స్ వ్యూహాలపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
US Green Card Curbs: అమెరికా ప్రభుత్వం విదేశీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ (PERM లేబర్ సర్టిఫికేషన్) ప్రక్రియపై విధించిన సస్పెన్షన్ నిర్ణయం తమ కంపెనీ కార్యకలాపాలపై గానీ, క్లయింట్ సేవలు , వర్క్‌ఫోర్స్ వ్యూహాలపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్ సహా ఎనిమిది ప్రముఖ ఐటీ సంస్థలను PERM కార్యక్రమం నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై టీసీఎస్ స్పందిస్తూ, అమెరికా కార్మిక శాఖ జారీ చేసే అన్ని మార్గదర్శకాలకు, నిబంధనలకు సంపూర్ణంగా కట్టుబడి ఉంటామని తెలిపింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు షాక్.. అమెరికా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేత..
తమ కంపెనీ వ్యాపార విధానంలో భాగంగా ఇప్పటికే స్థానిక నియామకాలపై (Local Hiring) ప్రత్యేక దృష్టి సారించామని టీసీఎస్ స్పష్టం చేసింది. గడిచిన రెండేళ్లుగా తమ PERM లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమైందని, అందువల్ల గ్రీన్ కార్డ్ ప్రక్రియను నిలిపివేయడం తమ మానవ వనరుల ప్రణాళికలను దెబ్బతీయదని వివరించింది. అంతేకాకుండా, రాబోయే ఐదేళ్ల కాలంలో అమెరికా స్థానిక మార్కెట్ నుండి సుమారు 15,000 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తన ప్రకటనలో వెల్లడించింది. అమెరికన్లకే ఈ ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేసింది.