Israel Informers killed: ఇజ్రాయెల్‌ ‘ఇన్‌ఫార్మర్ల’ను దారుణంగా చంపి.. స్తంభానికి మృతదేహాలు వేలాడదీత.. పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదుల దారుణం

వారి మృతదేహాలను ఈడ్చుకెళ్లి స్తంభానికి వేలాడదీశారు.

Israel Informers killed (Credits: X)

Newdelhi, Nov 27: ఇజ్రాయెల్‌ (Israel) కు ‘ఇన్‌ఫార్మర్లు’గా (Informers) వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదులు దారుణంగా చంపారు. (Israel informers killed) వారి మృతదేహాలను ఈడ్చుకెళ్లి స్తంభానికి వేలాడదీశారు. పాలస్తీనాలోని వెస్ట్‌ బ్యాంక్‌ లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 6న వెస్ట్‌ బ్యాంక్‌ లోని తుల్కరేమ్ శరణార్థి శిబిరానికి చెందిన ఇద్దరు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇజ్రాయెల్‌ ఆర్మీ ఆ శిబిరంపై దాడి చేసింది. పాలస్తీనాకు చెందిన ముగ్గురు కీలక ఉగ్రవాదులను హతమార్చింది.

Delhi Crime: ఇల్లు శుభ్రం చేసే విషయంలో దంపతుల మధ్య గొడవ.. మాటామాట పెరగడంతో భర్త చెవి కొరికేసిన భార్య.. ఢిల్లీలో ఘటన

ఈ సంఘటన నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంక్‌ లోని ఆ శరణార్థి శిబిరానికి పాలస్తీనా మిలిటెంట్లు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు ఇన్‌ఫార్మర్‌ గా పని చేసిన ఇద్దరు పాలస్తీనియన్లను చంపారు. వారి మృతదేహాలను వీధుల్లో ఈడ్చుకెళ్లగా అక్కడి జనం కాళ్లతో తన్నారు. అనంతరం ఒక విద్యుత్‌ స్తంభానికి మృతదేహాలను వేలాడదీశారు. మృతులను 31 ఏళ్ల హంజా ముబారక్, 29 ఏళ్ల ఆజం జుబ్రాగా గుర్తించినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif