![](https://test1.latestly.com/uploads/images/2025/02/image.jpg?width=380&height=214)
SC Orders APSRTC to Pay Rs 9 Crore compensation: ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించిన మహిళ కుటుంబానికి రూ. 9 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)ని ఆదేశించింది.2009లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) రూ.9,64,52,220 పరిహారం చెల్లించాలని (SC Orders APSRTC to Pay Rs 9 Crore compensation) సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం జస్టిస్ సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొంది అమెరికాలో నివసిస్తున్న లక్ష్మీ నాగళ్ల జూన్ 13, 2009న తన భర్త మరియు ఇద్దరు కుమార్తెలతో కారులో రాజమహేంద్రవరం ప్రయాణిస్తుండగా, అన్నవరం సమీపంలో వారి వాహనాన్ని APSRTC బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమెరికాలో నెలకు $11,600 సంపాదిస్తున్న లక్ష్మీ తీవ్ర గాయాలతో (Road Accident Case in 2009) మరణించింది. ఆమె భర్త తన భార్య సంపాదన సామర్థ్యాన్ని పేర్కొంటూ సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో రూ.9 కోట్ల పరిహారం కోసం క్లెయిమ్ దాఖలు చేశాడు.
అయితే ట్రిబ్యునల్ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో తీర్పు ఇచ్చింది. అయితే, ఈ ఉత్తర్వును APSRTC తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది, ఇది పరిహార మొత్తాన్ని రూ.5.75 కోట్లకు తగ్గించింది. ఆ తరువాత భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ట్రిబ్యునల్ తీర్పును సమర్థించిన అత్యున్నత ధర్మాసనం రూ. 9,64,52,220 చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించింది.