12 killed in Pakistan suicide attack(AP)

Delhi, March 5:  పవిత్ర రంజాన్ మాసం వేళ పాకిస్థాన్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. వాయువ్య పాకిస్తాన్‌లోని సైనిక స్థావరంనే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడి చేయగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు( Pakistan Suicide Attack). పాకిస్తాన్ తాలిబాన్‌కు అనుబంధమైన బన్ను, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించింది.

ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు సైనిక స్థావరం గోడ సమీపంలో తమను తాము పేల్చుకున్నారని, ఆ తరువాత 5 నుంచి 6 మంది మరింత లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారని, అయితే వారిని భద్రతా దళాలు హతమార్చాయని చెప్పారు. ఈ దాడి రంజాన్ పవిత్ర మాసంలో సాయంత్రం ప్రార్థన మరియు ఉపవాస విరామ సమయంలో జరిగింది.

వీడియోలు ఇవిగో, మంటల్లో తగలబడుతున్న అమెరికాలోని రెండు రాష్ట్రాలు, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా తీవ్రరూపం దాల్చిన కార్చిచ్చు 

రంజాన్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్‌లో చోటుచేసుకున్న మూడవ ఉగ్రదాడి(Pakistan military base). పేలుళ్ల అనంతరం ఆకాశంలో పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల సమీపంలోని ఇళ్లకు, భవనాలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఈ పేలుళ్ల ప్రభావంతో సమీపంలోని మసీదు పైకప్పు కూలిపోయింది. అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్న పలువురు లోపల చిక్కుకుపోయారని రక్షణ సిబ్బంది తెలిపారు. మసీదు ఇమామ్ మృతదేహాన్ని శిథిలాల మధ్య నుండి వెలికితీసినట్లు తెలిపారు.

12 killed in Pakistan suicide attack.. 

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రాణ నష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.గత నవంబరులో జరిగిన ఒక ఆత్మాహుతి కార్ బాంబింగ్ దాడిలో 12 మంది సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలం పెషావర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఖైబర్‌ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో ఉందని పోలీసులు తెలిపారు.

పేలుడు తర్వాత గోడను బద్దలు కొట్టి చాలా మంది ఉగ్రవాదులు కంటోన్మెంట్‌ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, భద్రత దళాలు వారిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు చెప్పారు.