US Shooting: తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ఏడాది వయసున్న చెల్లిని కాల్చేసిన మూడేళ్ల చిన్నారి, తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి

సోమవారం ఓ చిన్నారి తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున తన ఏడాది వయసున్న సోదరిని చంపేసింది ఇంట్లో గన్ తో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కిడంతో అక్కడే ఆడుకుంటున్న చెల్లి తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది

Alabama Shooting

US, July 18: అమెరికాలోని కాలిఫోర్నియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఓ చిన్నారి తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున తన ఏడాది వయసున్న సోదరిని చంపేసింది ఇంట్లో గన్ తో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కిడంతో అక్కడే ఆడుకుంటున్న చెల్లి తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. రక్తపుమడుగులో పడిపోయిన సోదరిని చూసి ఎమర్జెన్సీకి ఫోన్ చేసింది.

దీంతో ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుల్లెట్ గాయంతో రక్తపుమడుగులో పడి ఉన్న ఏడాది చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, పాప అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో కౌంటీ ఫాల్ బ్రూక్ లో సోమవారం ఉదయం 7:30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘోరం జరిగింది.

అమెరికాలో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై ఏకంగా 7.4 నమోదు, సునామీ హెచ్చరికలు..ఆందోళన చెందుతున్న NRI భారతీయులు..

మూడేళ్ల చిన్నారి తన ఏడాది వయసున్న చెల్లితో కలిసి ఆడుకుంటూ తుపాకీ ట్రిగ్గర్ నొక్కింది. దీంతో ఎదురుగా కూర్చున్న పాప తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. పాప ప్రాణాలు కాపడేందుకు శాయశక్తులా ప్రయత్నించామని, అయితే, ఆసుపత్రికి తరలించేలోగా చనిపోయిందని వివరించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif