Citigroup ‘Clerical Error’: చిన్న తప్పుతో రూ. 6700 కోట్లు రుణదాతల ఖాతాల్లోకి, తిరిగి రాబట్టుకునేందుకు నానా కష్టాలు పడుతున్న సిటీ గ్రూపు, దివాళా దిశగా రెవ్లాన్ కంపెనీ

బ్యాకింగ్ రంగ దిగ్గజం సిటీబ్యాంక్‌లో పని చేసే ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు (Citigroup Mistakenly Pays $900 Million) కారణంగా సిటీబ్యాంక్‌ భారీ వివాదంలో (Citigroup Clerical Error) చిక్కుకుంది. న్యూయార్క్‌ సిటీబ్యాంకు శాఖలో చోటుకున్న ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ సంక్షోభంతో సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్‌‌, సుమారు బిలియన్‌ డాలర్ల మేరకు రుణదాతలకు బకాయి పడింది. దీంతో ఈ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగాయి. సంబంధిత రుణాలను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ యూఎంబీ బ్యాంక్, రుణదాతల తరపున రెవ్లాన్‌పై (Revlon) దావా వేసింది.

Representational Image (Photo Credits: Pixabay)

Wall Street, August 17: బ్యాకింగ్ రంగ దిగ్గజం సిటీబ్యాంక్‌లో పని చేసే ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు (Citigroup Mistakenly Pays $900 Million) కారణంగా సిటీబ్యాంక్‌ భారీ వివాదంలో (Citigroup Clerical Error) చిక్కుకుంది. న్యూయార్క్‌ సిటీబ్యాంకు శాఖలో చోటుకున్న ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ సంక్షోభంతో సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్‌‌, సుమారు బిలియన్‌ డాలర్ల మేరకు రుణదాతలకు బకాయి పడింది. దీంతో ఈ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగాయి. సంబంధిత రుణాలను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ యూఎంబీ బ్యాంక్, రుణదాతల తరపున రెవ్లాన్‌పై (Revlon) దావా వేసింది.

ఈ కేసులో సిటీ బ్యాంకును (Citibank) కూడా ప్రతివాదిగా చేర్చాయి. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంకు 900 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని పొరపాటున రెవ్లాన్‌ ఖాతా నుంచి రుణదాతల ఖాతాల్లో జమ చేసింది. ఈ ఊహించని పరిణామంతో ఇప్పటికే అప్పుల ఊబిలో ఇరుక్కున్న రెవ్లాన్ మరింత సంక్షోభంలో పడిపోయింది. అంతేకాదు కంపెనీ మొత్తం బకాయిలకు ఈమొత్తానికి సమానం కావడం మరింత ప్రకంపనలు పుట్టించింది. ఈ నేపథ్యంలో ఈ సొమ్మును రాబట్టుకునేందుకు సిటీ గ్రూపు నానా కష్టాలు పడుతోంది. మలేషియాలో డేంజర్ వైరస్, కరోనా కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రమాదకరం‌తో D614G వైరస్, మొత్తం 45 కేసులు నమోదు, రూల్స్ బ్రేక్ చేసినందుకు పేషెంట్‌కి ఐదు నెలల జైలు శిక్ష

ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు బ్రిగేడ్, హెచ్‌పీఎస్, సింఫనీతో సహా రుణాలిచ్చిన సంస్థలు తిరస్కరించాయి. తమకు అందిన సొమ్ము రుణానికి, వడ్డీకి సమానమని వాదిస్తున్నాయి. దీంతో వ్యవహరం మరింత ముదిరింది. ఇది ఈ శతాబ్దానికే అతి పెద్ద తప్పిదమంటూ దివాలా సలహాదారు మైఖేల్ స్టాంటన్ విమర్శించారు. అయితే ఈ పరిణామంపై సిటీ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. అటు అసలు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని రెవ్లాన్‌ తెగేసి చెప్పింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement