Kuala Lumpur, August 17: మలేషియాలో ప్రమాదకరవైరస్ (D614G in Malaysia) వెలుగులోకి వచ్చింది. అయితే ఇది యూరప్, ఉత్తర అమెరికా ఖండంలో కనిపించింది. దానికి D614G అని పేరు కూడా పెట్టారు. తాజాగా మలేషియాలో కూడా ఈ వైరస్ బయటపడింది. అయితే ఇది కరోనా వైరస్ లాగానే ఉంది. అయితే లక్షణాలు కరోనా( Coronavirus) కన్నా 10 రెట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇండియాకి వెళ్లి మలేసియా తిరిగొచ్చిన ఓ రెస్టారెంట్ ఓనర్‌కి కరోనా వచ్చింది. ఆయన ద్వారా మరికొంత మందికి ఈ వైరస్ వ్యాపించింది. ఇలా మొత్తం అక్కడ 45 కేసులు నమోదయ్యాయి.
వాళ్లకు పరీక్షలు చేయగా వాళ్లలో ముగ్గురిలో ఈ కొత్త ప్రమాదకర కరోనా వైరస్ కనిపించింది. మలేసియా (Malaysia) ఓనర్ ఇండియా నుంచి తిరిగి వెళ్లాక 14 రోజులు హోమ్ క్వారంటైన్ అవ్వాల్సి ఉంది. అలా చెయ్యకుండా రూల్స్ బ్రేక్ చేయడంతో అతన్ని అరెస్టు చేసి... ఐదు నెలల జైలు శిక్ష విధించారు. కొంత మొత్తంలో ఫైన్ కూడా వేశారు. వీరితో పాటు ఫిలిప్పీన్స్‌కి వెళ్లి తిరిగి మలేసియాకి వచ్చిన కొందరి వల్ల కూడా మరింకొంతమందికి కరోనావైరస్ సోకింది. అక్కడ కూడా ఈ కొత్త ప్రమాదకర కరోనా వైరస్ ఉందని తేలింది.
అయితే ఇప్పుడు తయారవుతున్న వ్యాక్సిన్లు ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్‌ని మాత్రమే చంపగలవని మలేసియా హెల్త్ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా (Noor Hisham Abdullah) అంటున్నారు. కొత్త ప్రమాదకర కరోనా వైరస్‌ని చంపాలంటే ఆ వ్యాక్సిన్ల శక్తి సరిపోదని ఆయన అంటున్నారు. ఈ కొత్త వైరస్ యూరప్, అమెరికాలో మిగతా వైరస్‌ల కంటే ఎక్కువగా వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) మాత్రం ఈ కొత్త వైరస్ వల్ల కరోనా వ్యాధి మరింత తీవ్రమయ్యే అవకాశాలు లేవంటోంది.సెల్‌ప్రెస్‌లో పబ్లిష్ అయిన పేపర్ ప్రకారం కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ ప్రస్తుతం తయారవుతున్న వ్యాక్సిన్లను తట్టుకొని నిలబడగలదని అంటోంది. పెరుగుతున్న రికవరీ రేటు, దేశంలో 19 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు నమోదు, 26,47,664 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
ఇప్పటికే మనమంతా కరోనా వైరస్‌తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలో ప్రజలు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని నూర్ హిషామ్ తన ఫేస్ బుక్ పేజీలో ఆదివారం తెలిపారు. ప్రజల సహకారం లేనిదే కరోనాను బ్రేక్ చేయలేమని అన్నారు. మలేసియాలో చాలా వరకూ కరోనా కంట్రోల్‌లోనే ఉంది. ఇప్పుడు మళ్లీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. శనివారం 26, ఆదివారం 25 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 216 ఉన్నాయి. కొత్త ప్రమాదకర వైరస్ వల్ల కేసులు పెరగకుండా చూసుకోవడంపై మలేసియా ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తోంది.