SARS-CoV-2 Virus: కరోనావైరస్ మానవ సృష్టే, చైనా వుహాన్ ల్యాబొరేటరీ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చింది, నోబెల్ గ్రహీత మాంటగ్నియర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజాగా కరోనా వైరస్‌పై ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్ గ్రహీత లూక్ మాంటగ్నియర్ (French Nobel Prize Winner Scientist Luc Montagnier) సరికొత్త వివాదానికి తెరదీశారు. కరోనా మానవ సృష్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎయిడ్స్ వైరస్‌కు (AIDS Virus) వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో చైనీస్ ల్యాబొరేటరీ (China Lab) నుంచి అది బయటకు వచ్చిందని పేర్కొన్నారు.
London, April 19: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ( Coronavirus) పుట్టుక చైనా నుంచే జరిగిందనే వాదనలు రొజు రోజుకు బలంగా మారుతున్నాయి. తాజాగా కరోనా వైరస్‌పై ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్ గ్రహీత లూక్ మాంటగ్నియర్ (French Nobel Prize Winner Scientist Luc Montagnier) సరికొత్త వివాదానికి తెరదీశారు. కరోనా మానవ సృష్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎయిడ్స్ వైరస్‌కు (AIDS Virus) వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో చైనీస్ ల్యాబొరేటరీ (China Lab) నుంచి అది బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ఇండియా కొత్త ఎఫ్‌డీఐ రూల్స్, ఆవేశం వెళ్లగక్కిన చైనా
కరోనా వైరస్ జీనోమ్‌లో హెచ్‌ఐవీ, మలేరియా ఎలిమెంట్స్ ఉండడం తీవ్రంగా అనుమానించాల్సిన విషయమని చెప్పారు. వుహాన్ ల్యాబ్‌లో (Wuhan city laboratory) 2000 నుంచి కరోనా వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్నారని, ఇందులో వారు నిష్ణాతులని పేర్కొన్నారు. హెచ్‌ఐవీ వైరస్‌ను గుర్తించినందుకు 2008లో మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి మాంటగ్నియర్ నోబెల్ అందుకున్నారు.
Here's Luc Montagnier Opinion Video
జీవాయుధం (బయోవెపన్) తయారీ కోసం కాకపోయినా వైరస్‌లను గుర్తించడం, వాటిని ఎదుర్కోవడంలో అగ్రరాజ్యం అమెరికా కంటే తమదే పైచేయి అని చైనా చాటుకునే ప్రయత్నంలో.. ఈ ఉపద్రవం సంభవించి ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు ఫాక్స్ న్యూస్ ఒక కథనం ప్రచురించింది. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తున్న ఇంటర్న్ అనుకోకుండా ఈ వైరస్‌ను లీక్ చేశారని సదరు మీడియా పేర్కొంది. కరోనాతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు
కరోనా సహజంగానే ఉద్భవించిందని... అయితే ఇది గబ్బిలాల నుంచి మనిషికి సోకిన అనంతరం దానిపై ల్యాబ్‌లో పరిశోధనలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే ఉద్యోగికి వైరస్ సోకిందని.. తనకు తెలియకుండానే సదరు వ్యక్తి దీనిని వ్యాప్తి చేశారని తన కథనంలో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా షాక్, కరోనా అలర్ట్‌లో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని నిధులు నిలిపివేత
బయోవార్‌కు తెరతీసి ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యానికై చైనా ఈ ప్రాణాంతక వైరస్‌ను సృష్టిందని అది బెడిసికొట్టడంతో చైనీయులే మొదటి బాధితులయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, కేసులు, మృతుల సంఖ్య వంటి అంశాల్లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలపై అమెరికా సహా ఇతర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ఆనవాళ్లు తొలిసారిగా బయటపడ్డ వుహాన్‌లో కరోనా మరణాలను 1,290 ఎక్కువగా చూపుతూ తాజా గణాంకాలు విడుదల చేసింది. దాదాపుగా 50% ఎక్కువ మృతుల్ని చూపించింది. అమెరికాలో కరోనా మృత్యుఘోష, తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం
కేసుల సంఖ్యను చైనా సవరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందన
కరోనా మృతులు, కేసుల సంఖ్యను చైనా సవరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కోవిడ్-19 విజృంభణ అధికంగా ఉన్న సమయంలో లెక్కల నమోదులో తప్పిదాలు దొర్లి ఉండొచ్చని అభిప్రాయపడింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేసులను, మృతులను గుర్తించడం సవాళ్లతో కూడుకున్నదని డబ్ల్యూహెచ్‌వో కోవిడ్-19 టెక్నికల్ హెడ్ మారియా వాన్ కెర్కోవ్ అన్నారు. అన్ని దేశాలు కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత లెక్కలను సవరించుకోవాలని శుక్రవారం సూచించింది. చైనా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 4,632కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్ని కూడా 325 పెంచింది. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 82,692కి చేరుకుంది. కోవిడ్‌పై సమాచారాన్ని పారదర్శకంగా ఉంచేందుకే జాబితాను సవరించామని వుహాన్ స్పష్టం చేసింది.
వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ
అనుమానాలకు కేంద్ర బిందువుగా మారిన వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్‌ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి అంశంలో చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తికి కారణం చైనాయేనని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. 1917 తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం నిజమని తేలితే పరిణామాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి’’అని హెచ్చరించారు. కాగా చైనాలోని వుహాన్‌లో వైరాలజీ ల్యాబరెటరీ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందని అమెరికా చేస్తున్న ఆరోపణల్ని వూహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్ తోసిపుచ్చారు. ఈ ల్యాబ్‌లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో, ఎంత గట్టి భద్రత ఉందో మాకే తెలుసు. ల్యాబ్‌లోంచి వైరస్ బయటకు వచ్చే అవకాశం లేదు’’అని స్పష్టం చేశారు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణాలు 40 వేలు దాటగా... 7,64,000ల మంది అంటువ్యాధి బారిన పడ్డారు. ఇదిలా ఉండగా.. అమెరికా కోవిడ్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావిస్తున్న న్యూయార్క్‌లో దాదాపు 17 వేల మంది మృత్యువాత పడగా... 2,42,000 మందికి కరోనా సోకింది. అయితే గత వారం రోజులుగా అక్కడ కరోనా కేసుల సంఖ్యలో 50 శాతం తగ్గుదల నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.