New Delhi, April 20: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (Foreign direct investment) సంబంధించి భారత్ కొన్ని మార్పులు చేసిన సంగతి విదితమే. కాగా ఎఫ్‌డీఐ (FDI) విషయంలో భారత్ కీలక మార్పులు చేయడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 (C)ovid-19) పరిస్థితిని ఆసరాగా చేసుకుని చైనా (China) సహా పొరుగుదేశాలు 'ఆవకాశవాద టేకోవర్'లకు పాల్పడకుండా భారత్ ఈ కఠిన చర్యలు చేపట్టింది.
ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌లో కొత్తగా చోటు చేసుకున్న మార్పులు డబ్ల్యూటీఓ (WTO) సూత్రాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని చైనా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా షాక్, కరోనా అలర్ట్‌లో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని నిధులు నిలిపివేత
పక్షపాతంలేకుండా, స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యం వంటి డబ్ల్యూటీఓ సూత్రాలకు భారత్ నిర్ణయం పూర్తి వ్యతిరేఖమని సోమవారం చైనా తెలిపింది. కొత్త నియమనిబంధనలతో చైనా పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం పడనుందని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్ ఓ ప్రకటనలో తెలిపారు. వివక్ష పూరిత నూతన విధానాలను భారత్ మారుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను సమంగా చూడాలని ఆయన కోరారు.
అమెరికాలో కరోనా మృత్యుఘోష, తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం
కాగా ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న, లేదా భవిష్యత్తు ఎఫ్‌డీఐల (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) విషయంలోనూ ఓనర్‌షిప్ బదిలీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. కొత్తగా కొన్ని నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది.
డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPITT) జారీ చేసిన ప్రకటన ప్రకారం భారత్‌తో బోర్డర్లు కలిగిన దేశాలు ఇండియాలోని కంపెనీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పక తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనలు మార్చింది.
ప్రపంచాన ఆగని కరోనా మృత్యుఘోష, లక్షమందికి పైగా మృతి
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కంపెనీలకు కష్టకాలం వచ్చింది. లాక్ డౌన్ వల్ల కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. అలాంటి కంపెనీల మీద విదేశీ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఆయా సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసి భారత్‌లోని కంపెనీల్లో తమ వాటాను పెంచుకునేందుకు, లేదా ఏకమొత్తంగా కైవసం చేసుకునేందుకు దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నాయి. అలాగే, విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు భారత కంపెనీల ఓనర్ షిప్‌ను మార్పు చేసే అంశానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది.
కరోనాతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు
గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను ఉద్దేశిస్తూ ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా జారీ చేసిన ఆదేశాలను పరిశీలిస్తే... ఇది చైనా కంపెనీలకు ఝలక్ లాంటిది. చైనాకు చెందిన పలు కంపెనీలు భారత్‌లోని ఆర్థిక కష్టాల్లో ఉన్న కంపెనీల నుంచి వాటాలు కొనుగోలు చేయకుండా ఇలాంటి కట్టుబాట్లు విధించింది.