Coronavirus Outbreak in Italy. (Photo Credits: AFP)

Washington DC, April 11: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా (US Coronavirus) వైరస్ విజృంభిస్తోంది. ఇక్కడ కరోనా ఎంత తీవ్రంగా ఉందంటే గడిచిన 24గంటల్లో అమెరికాలో 2,100పైగా కరోనా మరణాలు (US Coronavirus Deaths) నమోదయ్యాయి. యూఎస్‌లోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కరోనా ట్రాకర్ ప్రకారం, అమెరికాలో (America) ఇప్పటి వరకు 5లక్షలమందికిపైగా కరోనా సోకింది. ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇలా ఒక్కరోజే అత్యధిక కరోనా మరణాలు నమోదు చేసిన తొలి దేశంగా అగ్రరాజ్యం నిలిచినట్లు వెల్లడించింది.

కరోనాతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు

అమెరికాలో ఇప్పటి దాకా దాదాపు 18,586 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మరణాల సంఖ్యలో ఇటలీ తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది. దాదాపు 5 లక్షల మంది అమెరికన్లు కరోనా బారిన పడ్డారు. ఇక న్యూయార్క్‌లో (New York) పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మృతదేహాలను పూడ్చడానికి సరిపడా చోటు లేకపోవడంతో సామూహిక ఖననం చేస్తున్నారు.

కరోనా కాటుకు బలైన స్పెయిన్‌ రాణి

కరోనాతో మరణించిన వారి మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి పేర్చి పూడ్చిపెట్టారు. ఇదిలా ఉండగా... అమెరికా తమ పౌరులను స్వదేశానికి రాకుండా అడ్డుకుంటున్న దేశాలపై వీసా నిబంధనలు కఠినతరం చేస్తామని ట్రంప్‌ సర్కారు హెచ్చరించింది. తమ పౌరుల అభ్యర్థనను తిరస్కరించిన దేశాలపై వీసా ఆంక్షలు విధించింది.కాగా, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 17లక్షల మందికి కరోనా వైరస్ సోకగా, వారిలో 1.02లక్షల మందికిపైగా మరణించినట్లు సమాచారం. అంతర్జాతీయంగా వైరస్‌ నుంచి 364,000 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

న్యూయార్క్‌లో కుప్పలు కుప్పలుగా కరోనా శవాలు

ఇటలీలో (Italy) కరోనా విలయతాండవం చేస్తోంది. కాగా లాక్‌డౌన్‌ను (Lockdown) మే నెల‌ 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఇట‌లీ ప్ర‌దాని గుసెప్పి కాంటే తెలిపారు. అయితే ఏప్రిల్ 14వ తేదీ త‌ర్వాత మాత్రం కొన్ని షాపులు తెరుచుకునే రీతిలో అనుమ‌తి ఇస్తామ‌న్నారు. ఇది క‌ష్ట‌మైన నిర్ణ‌య‌మే కానీ, రాజ‌కీయ బాధ్య‌త తాను తీసుకోనున్న‌ట్లు ప్ర‌ధాని కాంటె తెలిపారు. మార్చి 9వ తేదీ నుంచి ఇట‌లీలో క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించారు.

వుహాన్‌ కరోనా చావుల మిస్టరీ

షాపుల‌ను, బిజినెస్ సెంట‌ర్ల‌ను మూసివేశారు. అయితే సోమ‌వారం ఆ ఆంక్ష‌లు ముగియ‌నున్న నేప‌థ్యంలో.. ప్ర‌దాని కాంటే మ‌ళ్లీ ఆంక్ష‌ల‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పారు. ఇట‌లీలో ల‌క్ష‌న్న‌ర మందికి వైర‌స్ సంక్ర‌మించ‌గా, సుమారు 19 వేల మంది మ‌ర‌ణించారు. యూరోప్‌లో ఇట‌లీలోనే అత్య‌ధిక మ‌ర‌ణాలు న‌మోదైంది.

మీరంతా చావు కోసమే చూస్తున్నారు, సామాజిక దూరం పాటించకపోవడంపై స్వీడన్ ప్రధాని లావ్‌వెన్‌ ఆగ్రహం

ఒక్క వారం రోజుల్లోనే బ్రెజిల్‌లో (Brezil) క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య మూడింత‌లు పెరిగింది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1056 మంది చ‌నిపోయారు. బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలకు చేరుకున్న‌ది. అయితే క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఆయ‌న ఇటీవ‌ల బ్రెసిల్లికాలో ప‌బ్లిక్ షో నిర్వ‌హించారు. మ‌హ‌మ్మారి క‌న్నా ఆర్థిక విప‌త్తే దారుణ‌మైంద‌న్నారు. బ్రెజిల్‌లో అనేక రాష్ట్రాల్లో ఐసోలేష‌న్ ఆంక్ష‌ల‌ను విధించాయి. కానీ బొల్స‌నారో మాత్రం వాటిని ఎత్తివేయాల‌న్నారు. భార‌త్ వ‌ద్ద మాత్రం హైడ్రాక్సీ మాత్ర‌ల‌ను ఖ‌రీదు చేసేందుకు బొల్స‌నారో ఆస‌క్తి చూపారు.

మృతదేహాలను భద్రపరిచేందుకు లక్ష సంచులు కావాలని ఫెమా ఆర్డర్

స్పెయిన్‌లో (Spain) కొత్తగా 4,576 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 605 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. దీంతో స్పెయిన్‌లో మొత్తం మరణాల సంఖ్య 15,843కు చేరింది. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 157,022 మందికి వైరస్‌ సోకింది. 17 రోజుల తర్వాత శుక్రవారం అత్యల్ప మరణాల సంఖ్య నమోదైందని స్పెయిన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,783 చనిపోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 16,600కు చేరింది.

పాకిస్తాన్‌లో వివక్ష కుట్ర, సింధ్‌లో హిందువుల ఆకలి కేకలు

మొత్తంగా స్పెయిన్‌లో 16,081 మంది, ఇటలీలో 18,849, జర్మనీలో 2,707, ఫ్రాన్స్‌లో 13,197 మంది, యూకేలో 8,958 మంది, ఇరాన్‌లో 4,232, టర్కీలో 1006, బెల్జియంలో 3,019, స్విట్జర్లాండ్‌లో 1,002, నెదర్లాండ్స్‌లో 2,511, కెనడాలో 569, బ్రెజిల్‌లో 1,068 మంది ప్రాణాలు కోల్పోయారు.