Pakistan Prime Minister Imran Khan | File photo | (Photo Credits: PTI)

Sindh, April 1: పాకిస్తాన్‌లో కరోనావైరస్ (COVID-19 in Pakistan) కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక్కడ కరోనా కేసులు ( Coronavirus in pakistan) 2వేలకు దగ్గర్లో ఉన్నాయి. బాధిత ప్రాంతాలకు సహాయం చేయడానికి ఇమ్రాన్ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది, అయితే కరాచీలో హిందువుల పట్ల అక్కడి అధికారులు వివక్ష చూపిస్తున్నారు.

ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్

ఇటీవల, రేషన్ మరియు ఇతర నిత్యావసర వస్తువులను సింధ్ ప్రాంతంలోని ప్రజలకు పంపిణీ చేశారు. అయితే హిందువులను ఖాళీ చేతులతో ఇంటికి పంపించారు. సరుకులు ముస్లిం సమాజంలోని ప్రజలకు మాత్రమే ఇస్తున్నారని (Hindus Denied Ration In PAK)అక్కడి హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా సింధ్ ప్రావిన్స్‌లో (Sindh) 5 లక్షలకు పైగా హిందువులు ఉన్నారు.

మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా

సింధ్ ప్రావిన్స్‌లో, లాక్డౌన్ సమయంలో చిక్కుకున్న కూలీలు, కార్మికులకు రేషన్ పంపిణీ చేసే బాధ్యతను జిల్లా యంత్రాంగానికి, ఒక స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వం ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇక్కడ గుమిగూడిన సుమారు 3 వేల మందికి హెల్త్ స్క్రీనింగ్ కోసం ఏర్పాట్లు కూడా లేవు. కరాచీ నగరం, సింధ్ ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న హిందువులు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని రాజకీయ కార్యకర్త డాక్టర్ అమ్జాద్ అయూబ్ మీర్జా అన్నారు.

Here's ANI Tweet

వారు భారత ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నారని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) సింధ్ ప్రావిన్స్‌లోని హిందువుల కోసం రేషన్ మరియు ఇతర ముఖ్యమైన ఆహార పదార్ధాలను రాజస్థాన్ ద్వారా పంపాలని ఆయన కోరుతున్నారు. మానవ హక్కుల కార్యకర్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హిందువులకు రేషన్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజలు గుమిగూడి ఉంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లియారి, సచల్ ఘోత్, కరాచీలోని ఇతర ప్రాంతాలతో పాటు సింధు అంతటా హిందువులకు రేషన్ ఇవ్వడం లేదని తెలిపారు.

వైరస్ ధాటికి అగ్రరాజ్యం అతలాకుతలం

కొరోనావైరస్ మహమ్మారి మధ్య పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లో అధికారులు రేషన్ నిరాకరిస్తున్నారని హిందూ మరియు క్రైస్తవ వర్గాలకు చెందిన పలువురు సభ్యులు వార్తా సంస్థ ఏఎన్ఐకు తెలిపారు. హిందూ స్థానికులలో ఒకరు, "నా కొడుకు రిక్షా-పుల్లర్. అతను మా కుటుంబాన్ని నడుపుతున్నాడు, కాని ఇక్కడ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మేము మా ఇళ్ళ వద్ద కూర్చుని వారానికి పైగా గడిచింది. కాని అధికారులు మాకు ఇంకా ఏ ఆహార పదార్థాన్ని పంపలేదు. " "లాక్డౌన్ సమయంలో అధికారులు మాకు సహాయం చేయటం లేదు, రేషన్ కూడా మాకు అందించడం లేదు ఎందుకంటే మేము మైనారిటీ సమాజంలో భాగం." అని తెలిపారు

మరొక క్రైస్తవ స్థానికుడు, "మేము క్రైస్తవ సమాజానికి చెందిన వాళ్ళం కాబట్టి మేము అసమానతను ఎదుర్కొంటున్నాము. కరోనావైరస్ వ్యాప్తిలో మేము సంపాదించిన అన్ని వనరులను కోల్పోయాము." మరో క్రైస్తవ స్థానికుడు ఇలా అన్నాడు, "ప్రారంభంలో, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ సమయంలో రేషన్ పొందుతారని అధికారులు చెప్పారు, కాని తరువాత వారు దానిని మాకు ఇవ్వడాన్ని ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.