Washington, April 1: అగ్రరాజ్యం అంతకంతకూ అనుభవిస్తుంది. ప్రపంచాన్నే గడగడలాడించే అమెరికా నేడు కరోనావైరస్ ధాటికి విలవిలలాడుతోంది. ప్రపంచంలోనే ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలో నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి నాటికి అమెరికాలో కోవిడ్-19 (COVID-19 Outbreak in USA) కేసులు 2 లక్షలకు (1,85,0000) చేరువయ్యాయి, మరణాలు 4 వేలు దాటాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయే తప్ప, ఏ మాత్రం తగ్గడం లేదు.
అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) చేసిన కామెంట్లు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. 'రాబోయే రెండు వారాలు అత్యంత బాధాకరమైనవి' (Very, very painful’ two weeks) అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వచ్చే రెండు వారాల్లో గణనీయమైన కోవిడ్-19 మరణాలు నమోదు కావొచ్చని అక్కడి వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అంచనా ప్రకారం కనీసం 1 లక్ష నుండి 2 లక్షల 40 వేల అమెరికన్లు ప్రాణాలు కోల్పోబోతున్నట్లు లెక్కలు కట్టారు. కరోనా మరణం.. కడసారి కూడా చూసుకోలేని దైన్యం
ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఆ తరహా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా "రాబోయే కఠినతరమైన రోజులకు ప్రతి అమెరికన్ సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను" అని ట్రంప్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు. ఏప్రిల్ 30 వరకు అమెరికాలో 'సామాజిక దూరం' పాటించే నిబంధనలను పొడగిస్తున్నట్లు చెప్పారు.
ఇటు ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ (Antonio Guterres) కూడా రానున్న రోజుల్లో ప్రపంచం కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని హెచ్చరించారు. ప్రపంచ యుద్ధం-2 తర్వాత ఇంతటి విపత్కర పరిస్థితి గత 75 ఏళ్లలో ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. కోవిడ్-19పై పోరును ప్రపంచ దేశాలన్నీ మరింత ఉధృతం చేయాలని, రాజకీయాలను పక్కనబెట్టి ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.