New Delhi, April 1: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus outreak) అల్లకల్లోలం రేపుతున్న నేపథ్యంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కరోనా నియంత్రణకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ వినియోగం భారీగా పెరిగింది. వినియోగదారులు కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది.
లాక్‌డౌన్‌తో పిచ్చోళ్లవుతున్న జనం, భారీగా పెరుగుతున్న 'మెంటల్ కేసులు'
సబ్సీడియేతర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు (LPG Cylinder Price Drops) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ రూ. 744కి లభించనుంది. గత నెలలో ఇది రూ. 805.5 ఉండగా ఇది ఇప్పుడు రూ. 61.5 రూపాయలు తగ్గింది.
Here's the ANI tweet:
Price of LPG cylinders is at Rs 744.00 (decrease by Rs. 61.50) in Delhi and at Rs. 714.50 (decrease by Rs. 62) in Mumbai, today: Indian Oil Corporation pic.twitter.com/s2yAniC25D
— ANI (@ANI) April 1, 2020
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ వైద్య, ఆరోగ్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది, నిత్యావసర వస్తువులు అందించే వారి సేవలు తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం కరోనా వైరస్ హడలెత్తిస్తున్న నేపథ్యంలో వారు తమ ప్రాణాలకు తెగించి సైతం విధుల్లో పాల్గొంటున్నారు. అదే కోవలోకి ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే డెలివరీ బాయ్ నుంచి సంబంధిత సిబ్బంది కూడా వస్తారు.
ఈ విషయమై ఆలోచించిన ఎల్పీజీ పంపిణీ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ పంపిణీ చేసే డెలివరీ బాయ్స్, షోరూమ్ సిబ్బంది, గోడౌన్ కీపర్స్, మెకానిక్ లు ఎవరైనా ‘కరోనా’ సంబంధిత లక్షణాలతో ప్రాణాలు కోల్పోతే వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని అధికారిక ప్రకటన ద్వారా తెలిపాయి.