US Coronavirus Deaths: కరోనా కోరల్లో అమెరికా, రికార్డు స్థాయి మరణాలు, 2.70 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు, మృతదేహాలను భద్రపరిచేందుకు లక్ష సంచులు కావాలని ఫెమా ఆర్డర్
Donald Trump (Photo Credits: ANI)

New york, April 4: కరోనా కోరల్లో చిక్కి అగ్రరాజ్యం అమెరికా (United States Coronavirus) అతలాకుతలమవుతున్నది. కాగా కరోనా మరణాల ( Coronavirus) విషయంలో ఇతర దేశాలు అందుకోలేనంత ఎత్తులోకి అమెరికా (America) చేరుకుంది . గురువారం-శుక్రవారం వరకు 24 గంటల సమయంలో ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు (Coronavirus Deaths) సంభవించాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ పేర్కొంది.

పాకిస్తాన్‌లో వివక్ష కుట్ర, సింధ్‌లో హిందువుల ఆకలి కేకలు

ఇప్పటివరకు అమెరికాలో 2.70 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా, 7,400 మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత 24 గంటల్లోనే 1500 మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది. వచ్చే రెండువారాలు పరిస్థితులు మరింత విషమించనున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) అమెరికన్లందరూ మరో నాలుగు వారాలు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరానికి మించిన పరిష్కార మార్గం లేదని అన్నారు. ‘‘దేశ పౌరుల ప్రాణాలు కాపాడాలి. స్వీయ నియంత్రణ మీదే మన భవిష్యత్‌ ఆధారపడి ఉంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇల్లు కదలకుండా ఉండండి. మరో నెల రోజులు ఇలా చేస్తే మనం కరోనాపై యుద్ధంలో గెలుస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాలన్నీ పాటించండి’’అని ప్రజలకు ఆయన హితవు పలికారు.

మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా

కరోనాతో అమెరికాలో దాదాపు లక్ష నుంచి రెండున్నర లక్షమంది బలికానున్నారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉన్నవాటికి తోడు రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడంతో వైద్య సిబ్బంది సతమతమవుతున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు ప్రతిస్పందన సంస్థ ‘ఫెమా’ అక్కడి సైన్యాన్ని కోరడం గమనార్హం.

వైరస్ ధాటికి అగ్రరాజ్యం అతలాకుతలం

మరోవైపు, నిరుద్యోగం కూడా తారాస్థాయికి చేరుకున్నది. రెండువారాల్లో దాదాపు కోటిమంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారారు. ఆంక్షల నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నింటిని తెరిచినా, ‘టేక్‌ అవే’కు మాత్రమే అనుమతిస్తుండటంతో వాటి ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.

రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తుండటంతో మాస్క్‌లు, వెంటిలేటర్లు ఇతర వైద్య సామగ్రికి తీవ్ర కొరత నెలకొన్నది. తమ వద్ద ఆరురోజులకు సరిపడా వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని న్యూయార్క్‌ మేయర్‌ ఆండ్రూ క్యూమో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులోకి రాకపోతే మరణాలు భారీగా పెరుగుతాయని వ్యాఖ్యానించారు.

ప్రపంచాన కరోనా మృత్యుఘోష, ఇటలీలో 50 మంది డాక్టర్లు బలి

మరోవైపు, వచ్చే రెండు రోజుల్లో మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. న్యూయార్క్‌లో ఇప్పటికే పరిస్థితి దయనీయంగా ఉన్నది. టెక్సాస్‌లోనూ ఈ నెల మధ్యనాటికి పరిస్థితులు తీవ్రస్థాయికి చేరుకుంటాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. శీతాకాలం మొదలైతే వైరస్‌ వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

స్పెయిన్‌ విల విల 

కరోనా మ‌హ‌మ్మారితో స్పెయిన్‌ విలవిల్లాడిపోతోంది. అక్క‌డ‌ మార్చి 14 నుంచి స్పెయిన్‌లో లాక్‌డౌన్‌ అమలవుతున్న కూడా... రోజూ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7,134 పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం 77,488 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, వీళ్లలో 6,416 మంది పరిస్థితి విషమంగా ఉంది. కరోనా వైరస్‌ వల్ల మార్చి 17 నుంచి రోజూ వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. మార్చి 23 నుంచి రోజూ 500కు తక్కువ కాకుండా జనం చనిపోతున్నారు.

గత ఐదురోజులుగా చూసుకుంటే దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 14 వేలకు పైగా కరోనా మరణాలతో ఇటలీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే... స్పెయిన్‌ రెండో స్థానంలో ఉంది. స్పెయిన్‌లోఇప్ప‌టి వ‌ర‌కు 11,198 మంది కరోనాతో చనిపోయారు. అటు 80 వేల మంది హెల్త్‌ వర్కర్లుకు కరోనా వైరస్ సోకడం వల్ల విధులకు దూరమయ్యారు