Rome, Mar 31: కరోనావైరస్ మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా (Coronavirus Global Report) రోజు రోజుకూ పెరిగిపోతోంది.దీని దెబ్బకు వేలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు ఇంకా లాక్‌డౌన్‌లోనే (Corona Lockdown) ఉన్నాయి. వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది.
కరోనా అంతు చూస్తామంటున్న కార్పోరేట్
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,820 మంది కరోనా (Coronaviru) మహమ్మారికి బలైయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక కరోనా వైరస్ కేసుల సంఖ్య 8 లక్షలకు దగ్గర్లో ఉంది. వైరస్ నిర్థారణ అయినవారిలో మంగళవారం ఉదయం నాటికి 1,65,659 మంది కోలుకున్నారు.
అమెరికాలో కరోనా వైరస్ విలయ తాండవం
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. అమెరికా మొత్తమ్మీద 1,64,253 మంది కరోనా వైరస్ బారిన పడగా.. ఇప్పటి వరకు 3,167 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో 568 మంది ప్రాణాలు కోల్పోయారు. వచ్చే రెండు వారాల్లో కేసులు, మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోవచ్చునని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
కోలుకుంటున్న ఇటలీ
6 కోట్ల జనాభా ఉన్న ఇటలీలో కరోనా దెబ్బకు ఇప్పటి వరకు 11,591 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్ష మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. అంటువ్యాధి సోకి మరణించిన వారికి అంత్యక్రియలు సైతం నిర్వహించలేని దుస్థితి అక్కడ నెలకొంది. ప్రపంచ దేశాలు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా మొన్నటిదాకా అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అయితే ప్రస్తుతం ఇటలీ కరోనా ప్రమాదం నుంచి నెమ్మదిగా కోలుకుంటోందని ఆ దేశ వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన రెండు రోజులుగా కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల శాతంలో తగ్గుదల నమోదైనట్లు వెల్లడించారు.
50 మంది డాక్టర్లు బలి
కరోనా కేసులు నమోదు లో ఇటలీ చైనా ను మించిపోయింది. ఇక కరోనా రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులు దీనికి బలవుతున్నారు. ఒక్క ఇటలీలో ఇప్పటిదాకా 50 మంది డాక్టర్లు కరోనా కారణంతో మరణించినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ఫిలిపో అనేలి వెల్లడించింది. అందులో 17 మంది వైద్యులు ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న లొంబార్డి రీజియన్‌కు చెందిన వారేనని తెలిపింది.
యూర్‌ప్ అతలాకుతలం
కరోనా వైరస్ ప్రపంచాన్ని, ముఖ్యంగా యూర్‌పను మంచాన పడేసింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 36వేల పైచిలుకు మరణాల్లో మూడింట రెండొంతులు ఈ ఒక్క ఖండాన చోటు చేసుకున్నాయి! ఒక్క ఐరోపా దేశాల్లోనే దాదాపు 4లక్షల పైచిలుకు మందికి వైరస్ సోకగా 25వేల మంది మరణించారు.
స్పెయిన్ మృత్యుఘోష
స్పెయిన్ మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. స్పెయిన్‌లో గంటకు 35 మంది చనిపోతున్నారు. ఒక్కరోజులో అక్కడ 812 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఘోరం ఏంటంటే- వైరస్ సోకిన వారిలో దాదాపు 15శాతం మంది అంటే సుమారు 13వేల మంది వైద్య సిబ్బందే. ఇప్పటిదాకా అక్కడ 7340 మంది చనిపోయారని తెలుస్తోంది. యూర్‌ప్లో కొంతభాగం ఉన్న రష్యాకు ఈ సెగ తగలడంతో మాస్కో నగరంలో లాక్‌డౌన్ ప్రకటించింది. 1836 మందికి ఇది సోకినట్లు, ఇంతవరకూ 9 మంది మరణించినట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించింది.
ఒకే కుటుంబంలో 25 మందికి కరోనావైరస్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్వీయ-నిర్బంధంలోకి వెళ్లారు. కొవిడ్-19 బారిన పడ్డ బ్రిటన్ యువరాజు ఛార్లెస్ స్వీయ-ఏకాంతం నుంచి బయటపడ్డారు. ఆయన కోలుకున్నట్లు రాజప్రతినిధి ఒకరు చెప్పారు.
ఇరాన్‌లో పరిస్థితి మరీ గడ్డుగా తయారైంది. ఒక్క రోజులో 117 మంది మరణించారు.ఇరాన్‌లో 2.757 మందిని కరోనా వైరస్ పొట్టనపెట్టుకుంది. కేసుల సంఖ్య 21,600 దాటింది. ఆస్ట్రేలియాలో ఇప్పటిదాకా 18 మంది మరణించారు. న్యూజిలాండ్‌లో తొలి మరణం నమోదైంది. ప్రముఖ జపనీస్ కమెడియన్ కెన్ షిముర (70), గ్రామీ పురస్కార గ్రహీత, అమెరికన్ సింగర్ జో డిప్ఫే (61) కరోనాతో మృతిచెందారు. మరో దిగ్గజ గాయకుడు జాన్ ప్రైన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రీ కొడుకుల వీడియో
చైనాలో 81,518 మంది కరోనా బారిన పడగా.. 3.305 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో 3024, ఇక భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 43కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 1347 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 137 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకు 77 కేసు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.